Sunday, December 22, 2024

మరో హిందూ ఆలయంపై దాడి.. గోడలపై ఖలిస్తానీ అనుకూల రాతలు

- Advertisement -
- Advertisement -

ఆలయం గోడలపై ఖలిస్తానీ అనుకూల రాతలు

న్యూకాలిఫోర్నియా: కాలిఫోర్నియాలోని హేవార్డ్‌లోగల ఒక హిందూ ఆలయంపై ఖలిస్తానీ అనుకూల రాతలు దర్శనమిచ్చాయి. హేవార్డ్‌లోగల షేరావాలి ఆలయం గోడలపై ఖలిస్తానీ అనుకూల రాతలు రాయడంపై అక్కడి హిందువులు ఆందోళన వ్యక్తం చేశారు. కాలిఫోర్నియాలోని నెవార్క్‌లోగల స్వామినారాయణ్ ఆలయం కొద్ది వారాల క్రితం కొందరు భారత వ్యతిరేక శక్తులు భారత వ్యతిరేక రాతలు రాయడం సంచలనం సృష్టించింది. కాలిఫోర్నియాలోని షేరావాలి ఆలయంపై ఖలిస్తానీ అనుకూల రాతలు రాసి ఆలయాన్ని అపవిత్రం చేశారని హిందూ అమెరికన్ ఫౌండేషన్ శుక్రవారం ఎక్స్ వేదికగా వెల్లడిచింది.

మరో హిందూ ఆలయంపై ఖలిస్తానీ అనుకూల రాతలతో దాడి జరిగిందని ఫౌండేషన్ తెలిపింది. స్వామినారాయణ్ ఆలయంపై రెండు వారాల క్రితం దాడి జరిగిందని, వారం రోజుల క్రితం శివ దుర్గ ఆలయంపై దాడి జరిగిందని ఫౌండేషన్ పేర్కొంది. ఆలయ నిర్వాహకులతో తాము మాట్లాడుతున్నానమి, ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళతామని ఫౌండేషన్ తెలిపింది. హిందూ ఆలయాలపై ఖలిస్తానీ మద్దతుదారుల నుంచి ఎదురవుతున్న ముప్పును దృష్టిలో ఉంచుకుని ఆలయాల వద్ద సెక్యూరిటీ కెమెరాలను, అలారం వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని ఫౌండేషన్ కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News