Monday, December 23, 2024

కరోనా వేరియంట్లను కట్టడి చేసే మరో స్వదేశీ వ్యాక్సిన్ “వార్మ్‌”

- Advertisement -
- Advertisement -

కరోనా వ్యాక్సిన్లను నిల్వచేయడానికి సాధారణంగా కోల్డ్ చైన్ స్టోరేజి అవసరం. కానీ కోల్డ్‌చైన్ స్టోరేజీ అవసరం లేకుండా ఎలాంటి ఉష్ణోగ్రతల్లోనైనా నిల్వచేయగల కొత్త వ్యాక్సిన్ మనదేశం లోనే తయారైంది. బెంగళూరు లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సి) , బయోటెక్ స్టార్టప్ కంపెనీ మైన్‌వ్యాక్స్ సంయుక్తంగా వార్మ్ ( వెచ్చని) అనే పేరుతో ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. ఎలుకలపై ఈ వ్యాక్సిన్ ప్రయోగించగా ప్రాథమిక అధ్యయనం లోనే సత్ఫలితాలు కనిపించాయి. డెల్టా, ఒమిక్రాన్‌తోపాటు ఇతర కొత్త వేరియంట్లను ప్రతిఘటించే బలమైన యాంటీబాడీలను ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగలుగుతుందని పరిశోధకులు తెలుసుకున్నారు. మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే డెల్టాను ఎదిరించడంలో రెండున్నర రెట్లు, ఒమిక్రాన్‌ను ప్రతిఘటించడంలో 16.5 రెట్లు ఈ వ్యాక్సిన్ సమర్థత చూపిస్తుందని చెబుతున్నారు. ఈ వార్మ్ వ్యాక్సిన్‌ను 37 డిగ్రీల ఉష్ణోగ్రతలో నాలుగు వారాల వరకు , 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో 90 నిమిషాల వరకు నిల్వ చేయవచ్చని ఆస్ట్రేలియా కామన్‌వెల్త్ సైంటిఫిక్, అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి ఆర్గనైజేషన్ (సిఎస్‌ఐఆర్‌ఒ)పరిశోధకులు వెల్లడించారు. ప్రస్తుతం భారత్‌లో అందుబాటులో ఉన్న కొవిడ్ వ్యాక్సిన్లలో కొవిషీల్డ్ 2 నుంచి 8 డిగ్రీలు, ఫైజర్‌కు మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. ఈ వార్మ్ వ్యాక్సిన్ అందుబాటు లోకి వస్తే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, దేశాల్లో వ్యాక్సిన్ నిల్వ చేసుకోవచ్చు. రవాణా కూడా సులువవుతుంది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News