Monday, January 20, 2025

మరో ‘పరువు హత్య’

- Advertisement -
- Advertisement -

Another honor killing in Yadadri district

కులాంతర వివాహం చేసుకున్న రామకృష్ణ గౌడ్‌ను
కిరాయి గ్యాంగ్‌తో హత్య చేయించిన మామ?

యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర కలకలం రేపిన మరో పరువు హత్య

యాదగిరిగుట్టకు చెందిన
వెంకటేశ్ కుమార్తె భార్గవి,
రామకృష్ణగౌడ్‌ల ప్రేమ వివాహం
రెండు కుటుంబాల మధ్య
ఘర్షణలు హోంగార్డుగా చేస్తూ
సస్పెండైన రామకృష్ణగౌడ్
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో
చేరిక ఏప్రిల్ 15న
రామకృష్ణను హైదరాబాద్‌కు
తీసుకెళ్లిన లతీఫ్ లతీఫ్‌కు
సుపారీ ఇచ్చి హత్య
చేయించిన మామ?
నిర్ధారించిన భువనగిరి ఎసిపి
వెంకటరెడ్డి ఘటనలో
11మంది నిందితుల అరెస్టు

మన తెలంగాణ/యాదాద్రి భువనగిరి ప్రతినిధి/కొండపాక : తన కుమార్తె కులాంతర వివా హం చేసుకోవడంతో కక్ష పెంచుకున్న తండ్రి అ ల్లుడిని దారుణంగా హత్య చేసిన ఘటన యాదా ద్రి భువనగిరి జిల్లాలో సంచలనం సృష్టించింది. ఇందుకు సంబంధించి భువనగిరి ఎసిపి వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 15న అదృశ్యమైన స్థిరాస్తి వ్యాపారి, సస్పెండైన హోం గార్డు రామకృష్ణ గౌడ్ మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా కుక్కునూర్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొండపాక మండలం లకుడారంలో ఆదివారం పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ కేసు లో 11 మంది ప్రమేయం ఉన్నట్టు గుర్తించామ ని, కాగా, ఇప్పటికే మహిళతోపాటు నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు ఎసిపి తెలిపారు. కా గా, తన కూతురు భార్గవి కులాంతర వివాహం చేసుకుందని కక్ష పెంచుకున్న వెంకటేష్ అల్లుడిని హత్య చేయించేందుకు ప్లాన్ వేశాడు. లతీఫ్ అనే రౌడీషీటర్‌ను హత్యకు పురమాయించాడు.

సుపారీ ఇచ్చి మరీ అలుడిని హత్య చేయించా డు. భువనగిరి డివిజన్ గుండాలలో రామకృష్ణ ను హత్య చేయించిన లతీఫ్ గ్యాంగ్ మృతదేహాన్ని మెదక్ జిల్లాలో పడేశారు. ప్రస్తుతం లతీఫ్ గ్యాంగ్ రాచకొండ ఎస్‌వోటీ పోలీసుల అదుపులో ఉన్నాడు. వెంకటేష్ రాజపేట మండలం కాలువపల్లిలో వీఆర్వోగా పనిచేస్తుండగా, రామకృష్ణ హత్య కేసులో మరో హోంగార్డు యాదగిరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనపై భువనగిరి పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. యాదగిరిగుట్టకు చెందిన భార్గవి వలిగొండ మండలంలోని లింగరాజుపల్లికి చెందిన రామకృష్ణ గౌడ్ 2020 ఆగస్టు 16న ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నిరోజులపాటు లింగరాజుపల్లిలో ఉన్న రామకృష్ణ దంపతులు.. భార్గవి గర్బం దాల్చడంతో భువనగిరి పట్టణానికి మకాం మార్చారు.

ఆ సమయంలో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణలు జరిగాయి. కాగా, ఆరు నెలల క్రితం వీరికి పాప జన్మించింది. ఇటీవల రామకృష్ణ తుర్కపల్లి గుప్త నిధులు కేసులో నిందితుడిగా ఉండటంతో పోలీసులు హోంగార్డు విధుల నుంచి అతన్ని సస్పెన్షన్‌కు గురిచేశారు. అప్పటి నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ చెందిన లతీఫ్ అనే వ్యక్తి భూమి చూపించడానికి ఏప్రిల్ 15న రామకృష్ణను హైదరాబాద్‌కు తీసుకెళ్లాడు. ఇంటి నుంచి వెళ్లిన రామకృష్ణ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన ఆయన భార్య భార్గవి శనివారం ఉదయం భువనగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రామకృష్ణను ట్రాప్ చేసి హత్య చేశారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. భార్గవి కుటుంబ సభ్యులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని చెబుతున్నారు.

ఇంటి నుంచి వెళ్లిన భర్త తిరిగి రాలేదు

తన భర్త రామకృష్ణ ఇంట్లో ఉండగా జమ్మాపూర్ సర్పంచ్ భర్త అమృతరావు ఇంటి నుంచి తీసుకెళ్లారని రామకృష్ణ భార్య భార్గవి మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. ఆ తర్వాత తన భర్త తిరిగిఇంటికి రాలేదనిన్నారు. అమృతరావుని తన భర్త గురించి అడిగితే ఇంకా రాలేదా? అని తననే తిరిగి ప్రశ్నించారన్నారు. భూమి చూపించాలి అని తీసుకెళ్లారన్నారు. లతీఫ్ అనే వ్యక్తి పలుమార్లు భూమి కొనుగోలు కోసం అంటూ తన భర్త రామకృష్ణను సంప్రదించారని, లతీఫ్‌ను యాకయ్య అనే వ్యక్తి రామకృష్ణకు పరిచయం చేశారన్నారు. ఒకసారి తోట కావాలి అంటూ.. మరోసారి రోడ్డు సైడ్ భూమి కావాలంటూ పలుమార్లు కలిశారన్నారు. దుబాయ్ నుంచి వచ్చామని లతీఫ్ చెప్పేవారంటూ తెలిపారు. రామకృష్ణను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తన పుట్టింటి వారితో మాట్లాడటం లేదన్నారు. తమతో ఎటువంటి సంబంధంలేదని గతంలో తన తండ్రి వెంకటేష్ ఘర్షణ పెట్టుకున్నారని భార్గవి తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News