Monday, December 23, 2024

రూ.2,800 కోట్లు పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

 ముందుకొచ్చిన కెయిన్స్ టెక్నాలజీ

2 వేల మందికి ఉపాధి: కెటిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులు వరద ప్రవాహం కొనసాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన విధంగా ప్రభుత్వ ప్రోత్సాహకాలు లభించనుండటంతో రాష్ట్రంలో భారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రముఖ సంస్థలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టి తమ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, మరికొన్ని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రభుత్వంతో ఎంవోయులు కుదుర్చుకుంటున్నాయి. బెంగళూరు కంటే హైదరాబాద్ అనుకూలమని ఆయా సంస్థలు రాష్ట్రంలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు తరలివస్తున్నాయి. ఐటి పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఇటీవల విదేశీ పర్యటనలు రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు వచ్చేందుకు దోహదపడ్డాయి.

తాజాగా మరో దిగ్గజ సంస్థ రాష్ట్రానికి రావడానికి సిద్ధమైంది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ప్రముఖ కెయిన్స్‌టెక్ సంస్థ రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. ఆ సంస్థ ప్రతినిధులతో సమావేశమై ఎంవోయూ కుదుర్చుకోగా అందు కు సంబంధించిన ఫోటోలు, వివరాలను కెటిఆర్ ట్విట్టర్ లో పంచుకున్నారు. తెలంగాణలో అవుట్ సోర్స్‌డ్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్, కంపౌండ్ సెమీ కండక్టర్ తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నట్లు కెయిన్స్‌టెక్ సంస్థ ప్రకటించింది. కెయిన్స్ టెక్ సంస్థ తెలంగాణ రాష్ట్రంలో రూ. 2,800 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీంతో ప్రత్యక్షంగా 2 వేల మందికి ఉపాధి లభించనుంది. రాష్ట్రంలో పెట్టుపడి పెట్టేందుకు ముందుకు వచ్చిన కెయిన్స్‌టెక్ కంపెనీని మంత్రి కెటిఆర్ సాదరంగా స్వాగతించారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు తెలంగాణ వేదిక కావడం గర్వకారణంగా ఉందంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఫాక్స్ కాన్, కార్నింగ్ వంటి ప్రపంచ దిగ్గజ సంస్థల పెట్టుబడులతో తెలంగాణ రాష్ట్రం ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలకు గమ్యస్థానంగా మారిందని మంత్రి కెటిఆర్ ఆనందం వ్యక్తం చేశారు.

Investment 2

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News