Saturday, November 16, 2024

కృష్ణ నదిపై మరో అక్రమ ప్రాజెక్టు

- Advertisement -
- Advertisement -

సిద్దేశ్వరం వద్ద అలుగు పేరుతో
బ్యారేజీ నిర్మాణానికి పథకం

తెలంగాణకు మరింత నష్టం జరుగుతుందని రైతాంగం
ఆందోళన సిద్దేశ్వరం వద్ద వంతెనకు బదులుగా
బ్రిడ్జి బ్యారేజీకి కేంద్రంపై ఎపి ఒత్తిడి

మన తెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదిపై మరో అక్రమ ప్రాజెక్టుకు వ్యూహ రచన జరుగుతోంది. దేశంలోనే అత్యల్ప వర్షపాత ప్రాంతం, దశాబ్దాలుగా తాగునీటికి సాగునీటికి విలపిస్తున్న ప్రాంతం అన్న కారణాలతో వెనుకబడిన రాయలసీమ ట్యాగ్‌ను తగిలించి ఈ అక్రమ ప్రాజెక్టును తెరపైకి తెస్తోంది. కృ ష్ణానదిపై సిద్దేశ్వరం వద్ద నదికి అడ్డంగా బ్యారేజీ నిర్మించి నదిలో నీటిని రాయల సీమకు మళ్లించేందుకు ఈ పథక రచన జరుగుతోంది. ఇప్పటికే కేం ద్ర ప్రభుత్వ అనుమతుల్లేకుండా, అధికారికంగా నీటి కేటాయింపుల్లేకుండా నే ఎడాపెడా ప్రాజెక్టులు నిర్మించి అక్రమంగా నీటిని వినియోగించుకుంటు న్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కృష్నానదిపై మరో అక్రమ ప్రాజెక్టు ద్వారా నిరంతరాయంగా కృష్ణానదీజలాలను వినియోగింకునే విధంగా ప్రణాళిక సిద్దం చేస్తోంది. అందులో భాగంగానే సీమ ప్రాంత రైతులను రెచ్చగొట్టి ఉద్యమాలకు ఉసిగొలుపుతోంది.

ఎప్పుడో తాతల కాలం నాటి బూజుపట్టిన పా త ప్రతిపాదనలను మళ్లీ తెరపైకి తెస్తోంది. 1951లో అప్పటి ప్రభుత్వం కృ ష్ణానదీపై సిద్దేశ్వరం ప్రాజెక్టుకు ప్రతిపాదన చేసింది. అయితే సిద్దేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం వల్ల అధిక ప్రయోజనాలు ఉంటాయన్న అభిప్రాయంతో సిద్దేశ్వరం ప్రాజెక్టు ప్రతిపాదనను అప్పటి కేంద్ర ప్రభుత్వం పక్కన పెట్టింది. ఏడు దశాబ్దాల కిందటి కా లం చెల్లిన సిద్దేశ్వరం ప్రాజెక్టు వెనుకబడిన రాయల సీమ ప్రాంత అభివృద్ధికి జీవనాడి అన్న నినాదంతో ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమాలకు సిద్దమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కొత్త జాతీయ రహదారి మంజూరు సిద్దేశ్వరం ప్రాజెక్టు ఉద్యమానికి కొత్త ఆశలు పుట్టిస్తోంది. తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలుపు తూ సిద్దేశ్వం మీదుగా మరో కొత్త జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రప్రభుత్వం ఇటీవలే ఆమోద ముద్ర వేసింది.

హైదరాబాద్-నంద్యాల పేరుతో సాగే ఈ జాతీయ రహదారిని హైదరాబాద్, కల్వకుర్తి, సిద్దేశ్వరం ఆత్మకూరు, వెలుగోడు, నంద్యాల మీదుగా కర్నూలుచిత్తూరు జాతీయ రహదారికి అనుసంధానం కానుంది. ఇందులో భాగంగా ఈ మార్గంలో కృష్ణానదిని దాటేందుకు సిద్దేశ్వరం ప్రాంతంలో నదిపై వంతెన నిర్మించనున్నారు. ఇదే అదనుగా భావించి కర్నూలు , కడప జి ల్లాలకు చెందిన రైతులతో సిద్దేశ్వరం బ్యారేజి నిర్మాణ నినాదం తెరపైకి తెస్తున్నారు. సిద్దేశ్వరం వద్ద వంతెనకు బదులుగా బ్రిడ్జికం బ్యారేజి నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాంగంగానే సిద్దేశ్వరం జలదీక్ష పేరుతో వచ్చేనెల 31న ఉద్యమ కార్యచరణ ప్రకటించారు. కర్నూలు, కడప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి సిద్దేశ్వరం జలదీక్షను బలపరీక్షగా మలిచే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సీమ సాగునీటి సాధన సమితిని ముందుపెట్టి ప్రభుత్వమే ఈ ఉద్యమాన్ని నడిపిస్తోందన్న అనుమానాలు కూడ వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణ నోట మట్టి కొట్టే యత్నాలు

సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపడితే తెలంగాణ ప్రాంతానికి మరింత నష్టం జరుగుతుందన్న ఆందోళన ఈ ప్రాంత రైతాంగంలో వ్యక్తమవుతోంది. కృష్ణానదిపై ఒక పక్క అంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా సరిహద్దు ఒడ్డు ఉండగా, మరోపక్క తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ఒడ్డు ఉంది. సిద్దేశ్వరం బ్యారేజి నిర్మాణం వల్ల ఎపితోపాటు తెలంగాణ ప్రాంతానికి కూడా ఉపయోగం కులుగుతుందని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్నారు. సిద్దేశ్వరం బ్యారేజి నిర్మాణం వల్ల కృష్ణానదిలో నిటిని నిలువ ఉంచవచ్చని , ఈ నిలువ నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు క్యారీఓవర్ కింద ఉపయోగపడుతుందని చెబుతున్నారు. బ్యారేజి నిర్మాణం ద్వారా రాయలసీమ ప్రాంతానికి గ్రావిటి ద్వారానే నీరందనుంది. అదే తెలంగాణ ప్రాంతానికి మాత్రం అటు వంటి అవకాశాల్లేవు. ఎత్తిపోతల ద్వారానే ఈ ప్రాంతానికి నీరందే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే రాయలసీమ ప్రాంతానికి పోతిరెడ్డి పాడు ద్వారా నీటిని మళ్లించుకుపోతున్నారు. శ్రీశైలం కుడి కాలువ నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకూ జలాలను మళ్లించుకుపోయి అక్కడ నుంచి ఎస్‌ఆర్‌బిసి, గాలేరునగరి, తెలుగు గంగ కాలువకు, ఎస్కేప్ చానల్‌కు నీటిని పంపుతున్నారు. హంద్రీనీవా పథకానికి కూడా కృష్ణానదీజలాలను తోడిపోసుకుంటున్నారు. ముచ్చుమర్రితో కేసి కాలువకు కూడా మళ్లిస్తున్నారు. తాజాగా సిద్దేశ్వరం పేరుతో ఏపి ప్రభుత్వం కొత్త ఎత్తుగడకు తెరలేపుతోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News