Thursday, January 23, 2025

ట్రంప్ పాలకవర్గంలో మరో భారత అమెరికన్

- Advertisement -
- Advertisement -

శాన్‌ఫ్రాన్సిస్కో: అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి తన కార్యవర్గంలో భారత అమెరికన్లకు ప్రత్యేక స్థానం కల్పిస్తున్నారు. ఇప్పటికే పలువురు భారత సంతతికి చెందిన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించిన ట్రంప్, తాజాగా తన పాలకవర్గంలో మరో భారత అమెరికన్ వ్యాపారవేత్తకు చోటు కల్పించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై వైట్‌హౌస్ సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా వెంచర్ క్యాపిటలిస్ట్ శ్రీరామ్ కృష్ణన్ ను నియమిస్తున్నట్టు ప్రకటించారు. “వైట్‌హౌస్ ఆఫీస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీలో సీనియర్ సలహాదారుగా శ్రీరామ్ కృష్ణన్ పనిచేయనున్నారు. వైట్‌హౌస్ ఏఐ క్రిప్టో జార్ డేవిడ్ ఒ శాక్స్‌తో కలిసి ఆయన పనిచేస్తారు. కృత్రిమ మేథతో అమెరికన్ నాయకత్వాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారు” అని ట్రంప్ వెల్లడించారు.

దీనికి శ్రీరామ్ కృష్ణన్ స్పందిస్తూ కాబోయే అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. తమిళనాడు రాజధాని చెన్నైలో జన్మించిన శ్రీరామ్ కృష్ణన్ అన్నా యూనివర్శిటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. 2007లో మైక్రోసాఫ్ట్‌లో ప్రోగ్రామ్ మేనేజర్‌గా తన కెరీర్ ఆరంభించారు. ఆ తర్వాత ఫేస్‌బుక్, యాహూ, ట్విటర్ (ఇప్పుడు ఎక్స్), స్నాప్ వంటి సంసల్లో పనిచేశారు. 2022 లో ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన సమయంలో కృష్ణన్ అక్కడే పనిచేశారు. ఆ సమయంలో సంస్థ తదుపరి సీఈఓగా కృష్ణన్‌ను నియమిస్తారనే ప్రచారం జరిగింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News