Monday, December 23, 2024

‘బలగం’ సినిమాకు మరో అంతర్జాతీయ అవార్డు

- Advertisement -
- Advertisement -

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు అడ్డా. ఆ నేపథ్యంలో వచ్చిన సినిమా బలగం. ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌రామ్ హీరోహీరోయిన్లుగా నటించారు. జబర్దస్త్ కమెడియన్ వేణు ఎల్దండి తెరకెక్కించిన ఈ సినిమా అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన అందరూ తమ నిజజీవితంలో జరిగి సంఘటనలను మళ్లీ గుర్తుచేసుకుంటున్నారు. కొన్ని ప్రాంతాల్లో గత కుటుంబంలో గొడవలు జరిగి విడిపోయిన వాళ్లు కూడా బలగం సిన్మా చూసి ఒక్కటై కలిసిపోతూ తమ బలగాన్ని పెంచుకుంటున్నారు. కాగా, బలగం సినిమాకు మరో అంతర్జాతీయ అవార్డును దక్కించుకుంది. ఈ సినిమా ఇప్పటికే అంతర్జాతీయంగా సత్తా చాటింది.

ఆమ్ స్టర్ డామ్ లో ప్రకటించిన ‘ఆరౌండ్ ఇంటర్నెషనల్ అవార్డ్స్’ లో బెస్ట్ డైరెక్టర్ గా వేణు అవార్డు అందుకున్నాడు. ఇప్పటికే బలగం సినిమా ఖాతాలో 9 అవార్డులు వచ్చి పడ్డాయి. ఈ సందర్భంగా వేణు తనను ఎంతగానో ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. అటు వాషింగ్టన్ డిసి ఇంటర్నెషనల్ సినిమా ఫెస్టివల్ లో 4 అవార్డులను, ఒనికో ఫిల్మ్ అవార్డు, లాస్ ఎంజిల్స్ సినిమాటోగ్రఫీ అవార్డును సైతం బలగం సినిమా దక్కించుకుంది. బలగం సినిమాను ఖచ్చితంగా ఆస్కార్‌కు పంపించేలా చర్యలు తీసుకుంటానని ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించాడు. బలంగా చిత్రాన్ని తెలంగాణలోని పలు గ్రామాల్లో తెరలు వేసి ప్రదర్శనలు చేస్తున్న విషయం తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News