Monday, December 23, 2024

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ కేంద్రం సి4ఐఆర్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచ ఆర్ధిక వేదిక( వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్)లో తెలంగాణకు మొదటి రోజునే కీలక విజయం లభించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా విలసిల్లుతున్న హైదరాబాద్ నగరానికి మరో అంతర్జాతీయ సంస్థ రానుంది. ప్రపంచ ఆర్థిక వేదికకు చెందిన సి4 ఐఆర్ (సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్)కు చెందిన సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనుంది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో దీనికి సంబంధించిన ఒప్పందంపై వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరేమీ జర్గన్స్ , తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సెన్సెస్ ఫౌండేషన్ సి ఇఒ శక్తి నాగప్పన్ సంతకాలు చేశారు. ఈ కా ర్యక్రమంలో తెలంగాణ ఐటి, పరిశ్రమల మం త్రి కె.తారక రామారావు, ఐటి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, వరల్డ్ ఎకనామిక్ ఫో రమ్ అధ్యక్షుడు బోర్జ్ బ్రెండేతో పాటు ఇతర అ ధికారులు పాల్గొన్నారు. సై న్సెస్), ఆరోగ్య సంరక్షణ అంశాలపై ఈ కేం ద్రం అధ్యయనం చేస్తుంది.

భారత్‌లో సి4ఐఆర్ విభాగాన్ని ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ప్రస్తుతం అమెరికా, బ్రిటన్ దేశాల్లో ఇ లాంటి కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రం ఏర్పా టు కోసం హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కెటిఆర్ అన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ రా ష్ట్రానికి ఉన్న అనుకూలతలు, సత్తాకు ఈ కేం ద్రం ఏర్పాటే ప్రత్యేక నిదర్శనమన్నారు. తెలంగాణతోపాటు ప్రపంచవ్యాప్తంగా లైఫ్ సెన్సెస్ రంగం ఎదుగుదల, ఎకో సిస్టం పెంపొందించడానికి తమ ప్రభుత్వం చేపట్టిన ముందడుగు గా ఈ కేంద్రం ఏర్పాటును భావించాలన్నారు.

లైఫ్‌సైన్సెస్ హెల్త్ కేర్ రంగంలో ఉన్న అవకాశాలను భారతదేశం అందిపుచ్చుకోవడానికి ఈ కేంద్రం ఏర్పాటు దోహదపడుతుందని మంత్రి కెటిఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.హెల్త్‌కేర్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అగ్రగామిగా నిలిచేందుకు భారతదేశానికి అవకాశం ఉందని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రెసిడెంట్ బోర్జ్ బ్రెండే అ న్నారు. ప్రభుత్వం, మధ్య సమన్వ యం తోపాటు ఉద్యోగ, ఉపాధి కల్పన విషయాల్లో హైదరాబాదు కేంద్రం కీలక పాత్ర పో షిస్తుందన్నారు. హైదరాబాద్‌లో సి4ఐఆర్ ఏ ర్పాటుతో ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఫోరమ్ అధ్యక్షుడు బ్రెందే అన్నారు. వ్యాక్సిన్‌లు, ఎన్నో ఔషధాల తయారీలో భారతదేశానికి మరీ ముఖ్యంగా హైదరాబాద్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉందన్నారు.

నాలుగవ పారిశ్రామిక విప్లవ సాంకేతికతను ఉపయోగించుకొని ఆరోగ్య సంరక్షణలో గ్లోబల్ పవర్ హౌస్‌గా ఇండియా మారుతుందన్నారు. ఎకనామిక్ ఫోరం హెల్త్ కేర్ హెడ్ డాక్టర్ శ్యామ్ బిషెన్ మాట్లాడుతూ, ఈ ఎదుగుదలకు తెలంగాణ రాష్ట్రమే నాయకత్వం వహిస్తుందన్నారు. ప్రాంతీయ, జాతీయ , ప్రపంచ ఆరోగ్య సంరక్షణ రంగంలో వినూత్న మార్పులు తేవడం తోపాటు రోగులకు ప్రస్తుతం ఉన్న సౌకర్యాలను మెరుగుపరచడంలో ఈ కొత్త కేంద్రం ముఖ్యమైన పాత్ర పోషిస్తుందన్నారు. కాగా నాలుగు ఖండాలలో విస్తరించి ఉన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నాల్గవ పారిశ్రామిక విప్లవం నెట్‌వర్క్‌లో హైద్రాబాద్ కేంద్రం 18వది కావడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News