Monday, January 13, 2025

ఢాకాలో మరో ఇస్కాన్ కేంద్రానికి నిప్పు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా/ఢాకా: బంగ్లాదేశ్‌లో మరో ఇస్కాన్ కేంద్రంపై దుండగులు దాడికి తెగబడ్డారు. ఢాకాలోని నమ్హట్టా కేంద్రంలోని ఆలయంలోకి శనివారం తెల్లవారుజామున చొరబడి నిప్పు పెట్టారు. ఈ ఘటనలో విగ్రహంతో పాటు పరిసరాల్లోని పవిత్రమైన వస్తువులు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. ఈ మేరకు కోల్‌కతాలోని ఇస్కాన్ ఉపాధ్యక్షులు రామనారాయణ్ దాస్ పిటిఐ వార్తా సంస్థకు తెలిపారు. ఆలయంపై దాడితో ఆగకుండా దుండగులు ఇస్కాన్ ప్రతినిధులపై దాడులకు తెగబడి భయభ్రాంతులకు గురి చేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోల్ వెంట తీసుకెళ్లిన దుండగులు నమ్హట్టా సమీపంలోని దౌర్ గ్రామంలోని రాధాకృష్ణ ఆలయం, శ్రీశ్రీ మహాభాగ్య లక్ష్మీ నారాయణ ఆలయంలో నిప్పు పెట్టి విధ్వంసం సృష్టించారని, రెండు ఆలయాలు చాలా వరకు దెబ్బతిన్నాయని రామనారాయణ్ దాస్ వివరించారు.

బంగ్లాదేశ్‌లోని మధ్యంతర ప్రభుత్వానికి దాడులను నియంత్రించాలని మొరపెట్టుకున్నా మళ్లీ ఇలాంటి దురదృష్టకర ఘటనలు చోటుచేసుకుంటాయని అన్నారు. ఇస్కాన్ ఆందోళనను పట్టించుకోవడంలో అక్కడి అధికార యంత్రాంగం పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు తిలకం దిద్దుకోకుండా పూజా క్రతువుల్లో పాల్గొనాలని, తద్వారా కొన్ని మూకలకు లక్షంగా కాకుండా తప్పించుకోవచ్చని సూచించారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల ఇస్కాన్ ప్రతినిధి చిన్మయ్ కృష్ణదాస్ వివాదం తర్వాత అక్కడి హిందూ ఆలయాలపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజా దాడి చోటుచోసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News