Friday, December 20, 2024

మెటాలో మరోసారి ఉద్యోగాల కోత

- Advertisement -
- Advertisement -

సాన్ ఫ్రాన్సిస్కో : గతేడాది నవంబర్‌లో సుమారు 11 వేల మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత మెటా(గతంలో ఫేస్‌బుక్) మరోసారి సిబ్బందిలో కోత పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక ప్రకారం, ఇటీవల వారాల్లో బడ్జెట్, భవిష్యత్ ఉద్యోగుల సంఖ్యపై స్పష్టత లేదు.

దీంతో రాబోయే పనిభారాన్ని నిర్వాహకులు ప్లాన్ చేయలేకపోతున్నారని, ఇది ఉద్యోగుల నుంచి జీరో వర్క్ ఫిర్యాదులకు దారితీస్తోందని నివేదిక తెలిపింది. 2023లో వ్యయాలు 89 బిలియన్ డాలర్ల నుంచి 95 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని, సిఇఒ మార్క్ జుకర్‌బర్గ్ ‘ఇయర్ ఆఫ్ ఎఫిసియెన్సీ’ కాలంగా పేర్కొన్నారని గత నెలలో మెటా ప్రకటన చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News