- Advertisement -
న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో(యుటిలు) ఇప్పటికీ 1.77 కోట్ల డోసులకు పైగా కొవిడ్ వ్యాక్సిన్ ఉందని, రానున్న మూడు రోజుల్లో వీటికి మరో లక్ష డోసుల వ్యాక్సిన్ అందుతుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ బుధవారం తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రాలు, యుటిలకు ఉచితంగానూ, నేరుగా రాష్ట్రాలు కొనుగోలు చేసే పద్ధతి కింది 22 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను కేంద్రం అందచేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. వృథా అయిన వ్యాక్సిన్‌ను కూడా కలుపుకుని ఇప్పటివరకు మొత్తం వినియోగం 20,13,74,636 డోసులని కేంద్రం తెలిపింది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా రాష్ట్రాలు, యుటిలకు కొవిడ్-19 వ్యాక్సిన్‌ను కేంద్రం ఉచితంగా సరఫరా చేయడంతో నేరుగా అవి ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పిస్తోంది.
- Advertisement -