- Advertisement -
పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం నడక మార్గంలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. చిన్నారి లక్షితపై చిరుత దాడి చేసిన ప్రాంతానికి సమీపంలో చిరుతను గుర్తించారు. కెమెరా ట్రాప్స్ లో చిరుత, ఎలుగుబంటి రికార్డు అయ్యాయి. డిసెంబర్ 13, 26 తేదీల్లో కెమెరా ట్రాప్స్ లో రికార్డు అయినట్లు ఆలయ ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. తిరుమల దర్శనం కోసం వచ్చే భక్తులు అప్రమత్తంగా ఉండాలని ఆలయ అధికారులు హెచ్చరిస్తున్నారు.
- Advertisement -