Sunday, December 22, 2024

మరో అల్పపీడనం.. విస్తారంగా వర్షాలు

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్ : నైరుతి బంగాళాఖాతానికి సమీపాన హిందూమహాసముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో గురువారం నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనం 11వతేది నాటికి వాయువ్యదిశగా తమిళనాడు పుదుచ్చేరి తీరం వైపు కదులుతుందని తెలిపింది. అల్పపీడన ప్రభావంతో ఈ నెల 11, 12తేదిల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్రలోని పలుప్రాంతాల్లో తేలిక పాటినుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. అల్పపీడనం కారణంగా కోస్తా తీరం వెంబడి గంటకు 65కి.మి వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఫలితంగా సముద్రం అలజడిగా మారుతుందని తెలిపింది. అయితే తెలంగాణలో మాత్రం వర్షసూచన ఏది లేదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాగల మూడు రోజులపాటు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News