- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించాక తొలిసారి శ్రీలంకు సమీపాన ఈ నెల 9న ఈ అల్పపీడనం ఏర్పడనున్నట్టు తెలిపింది.దీని ప్రభావంతో తమిళనాడుతోపాటు దక్షణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. దక్షిణ తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో తేలిక పాటినుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. తూర్పు ఈశాన్యవైపు నుంచి రాష్ట్రంలో శీతల గాలులు వీస్తున్నట్టు తెలిపింది. శనివారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అదిలాబాద్‌లో అత్యల్పంగా 14డిగ్రీలు నమోదు అయ్యాయి. ్రగ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డిగ్రీలు నమోదు అయినట్టు తెలిపింది.అత్యధికంగా భద్రాచలంలో 23.5డిగ్రీలు రికార్డయినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది.
- Advertisement -