Sunday, December 22, 2024

హన్స్‌ఖలీ అత్యాచారం కేసులో మరో వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Another man arrested in Hanskhali rape case

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ లోని నదియా జిల్లా హన్స్‌ఖలీ ప్రాంతంలో సంచలనం కలిగించిన మైనర్ బాలిక అత్యాచారం కేసులో అనుమానితుడుగా భావిస్తున్న మరో వ్యక్తిని పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడికి అతను స్నేహితుడని సీనియర్ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. మరో ఇద్దరిని కూడా పోలీసులు నిర్బంధం లోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈనెల 4 న బర్త్‌డే పార్టీకి హాజరైన సమయంలో మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. తీవ్రమైన రక్తస్రావంతో ఆ మరుసటి రోజు బాలిక కన్నుమూసింది. ఈమేరకు బాలిక తల్లిదండ్రులు ఈనెల 9 న పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటన ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతను టిఎంసి నేత కుమారుడిగా గుర్తించారు. టీఎంసీ నేత ఒత్తిడి మేరకే శవపరీక్ష చేయకుండా మృతదేహాన్ని దహనం చేసినట్టు బాధిత కుటుంబీకుల ఆరోపణ. దీనిపై బిజెపి 12 గంటల బంద్‌కు పిలుపివ్వగా, హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం కూడా దాఖలైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News