కీవ్ : రష్యా వార్ క్రిమినల్స్ మరో ఉక్రేనియన్ మేయర్‌ను అపహరించుకుని పోయినట్టు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రోకులేబా ఆదివారం తెలిపారు. స్థానికులు సహకరించడం లేదనే కారణంగా దినిప్రోరుడ్నే సిటీ మేయర్ ఎవిహెన్ మట్వెయెవ్‌ను తిరుగుబాటుదారులు తమ వెంట తీసుకుపోయారని , భయోత్పాతం సృష్టించారని ఆరోపించారు. ఉక్రెయిన్ పైన, ప్రజాస్వామ్యం పైన, రష్యా టెర్రర్‌ను ఆపేందుకు ప్రపంచ దేశాలు అంతర్జాతీయ సంస్థలు ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ ఘటనకు కొన్ని గంటలకు ముందే మెటిలోపాల్ నగర మేయర్‌ను సైతం రష్యా సైనికులు కిడ్నాప్ చేసినట్టు ఉక్రెయిన్ ఆరోపించింది. పదిమంది రష్యా ఆక్రమణదారుల బృందం మెటిలోపాల్ నగర మేయర్‌ను సైతం రష్యా సైనికులు కిడ్నాప్ చేసినట్టు ఉక్రెయిన్ ఆరోపించింది. శత్రువులకు సహకరించడానికి ఫెడరోవ్ నిరాకరించడంతో అతన్ని కిడ్నాప్ చేశారని ఓ వీడియో సందేశంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్సీ చెప్పారు.
మరో మేయర్‌ను కిడ్నాప్ చేసిన రష్యా సైనికులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -