27న పింక్ లైన్‌పై డ్రైవర్ రహిత సర్వీసులు ప్రారంభం
న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డిఎంఆర్‌సి) మరో మైలురాయిని అధిగమించనున్నది. ఢిల్లీ మెట్రోకు చెందిన 57 కిలోమీటర్ల పింక్ లైనుపై ఈ నెల 27న డ్రైవర్హ్రిత రైలు సర్వీసులు ప్రారంభం కానున్నట్లు డిఎంఆర్‌సి అధికారులు మంగళవారం తెలిపారు. నవంబర్ 27న ఉదయం 11.30 గంటలకు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి, ఢిల్లీ రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లాట్ విడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా డ్రైవర్ రహిత రైలు సర్వీసులను ప్రారంభిస్తారని అధికారులు చెప్పారు. గత ఏడాది డిసెంబర్ 28న దేశంలోనే మొట్టమొదటి డ్రైవర్ రహిత రైలు కార్యకలాపాలను ఢిల్లీ మెట్రోకు చెందిన మజెంటా లైనుపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. అయితే మజ్లిస్ పార్కు నుంచి శివ్ విహార్ వరకు పింక్ లైన్‌పై డ్రైవర్ రహిత మెట్రో సర్వీసులు ఈ ఏడాది మధ్యలో ప్రారంభించనున్నట్లు అప్పట్లో డిఎంఆర్‌సి ప్రకటించినప్పటికీ కరోనా సంక్షోభం కారణంగా జాప్యం ఏర్పడింది.