Wednesday, January 22, 2025

చైనాలో మరో మంత్రి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

బీజింగ్ : చైనాలో పారిశ్రామిక వేత్తల నుంచి మంత్రుల వరకు చాలా మంది అదృశ్యమవుతున్నారు. కీలకమైన అధికారిక సమావేశాల్లో అకస్మాత్తుగా వారు కనిపించకపోవడం మామూలైంది. ఇప్పుడు ఆ జాబితా లోకి చైనా రక్షణ మంత్రి జనరల్ లీ షాంగ్‌ఫూ చేరారు. గత రెండు వారాలుగా ఆయన కనిపించకపోవడం చైనాలో కలకలం రేపుతోంది. జిన్‌పింగ్ హయాంలో కీలక వ్యక్తులు మాయమవ్వడం ఇటీవల కాలంలో పెరిగిపోయింది.

మే నెలలో అప్పటి చైనా విదేశాంగ మంత్రి కిన్‌గాంగ్ అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. అమెరికా మాజీ దౌత్యవేత్త హెన్రీ కిసింజర్ వచ్చినప్పుడు కూడా గాంగ్ కనిపించక పోవడం ఆశ్చర్య పరిచింది. తర్వాత కొన్ని రోజులకు ఆయనను తప్పించి విదేశాంగ బాధ్యతలను అంతకు ముందు నిర్వహించిన వాంగ్ యీకి అప్పగించారు. ఇప్పుడు షాంగ్‌ఫూ విషయం లోనూ ఇదే తరహా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షీ జిన్‌పింగ్ నేతృత్వంలో శుక్రవారం సెంట్రల్ మిలిటరీ కమిషన్ సమావేశం జరిగింది. ఈ కీలక సమావేశంలో రక్షణ మంత్రి లేకపోవడం చర్చనీయాంశమైంది. పైగా షాంగ్‌ఫూ చైనా అధ్యక్షుడికి సన్నిహితుడని పేరు. ఈనెల 7,8 తేదీల్లో వియత్నాం రక్షణ అధికారులతో జరిగిన అధికారిక కార్యక్రమాల్లోనూ లీ కనిపించలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News