Saturday, December 21, 2024

ఢిల్లీలో మరో మంకీపాక్స్ కేసు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఢిల్లీలో మరో వ్యక్తికి మంకీపాక్స్ సోకింది. దీంతో దేశంలో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. 31 ఏళ్ల వ్యక్తికి తాజాగా మంకీపాక్స్ నిర్ధారణ అయింది. అతడు ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయలేదని తేలింది. అయితే ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లోని మనాలీ లో జరిగిన ఒక స్టేజ్ పార్టీకి హాజరయ్యాడని అధికారులు చెప్పారు. జ్వరం, శరీరంపై పొక్కులు రావడంతో బాధితుడు డాక్టర్లను సంప్రదించాడు. ప్రస్తుతం అతడికి మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు. దీంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అప్రమత్తమైంది. మంకీపాక్స్‌పై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆధ్వర్యంలో ఆదివారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించింది. గతంలో దేశంలో మంకీపాక్స్ బారిన పడిన ముగ్గురూ కేరళకు చెందిన వారే. వీరు మధ్య ప్రాశ్చంలోని దేశాలకు వెళ్లి తిరిగి వచ్చాక వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. తాజాగా ఢిల్లీలో మంకీపాక్స్ కేసు బయటపడింది. ప్రపంచ వ్యాప్తంగా 16,000 మంది మంకీపాక్స్ బారిన పడ్డారు. ఈ వ్యాధి మొత్తం 75 దేశాలకు విస్తరించింది. మరోవైపు మంకీపాక్స్ కేసులు పలు దేశాలకు వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి విధించింది.

Another Monkeypox Case found in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News