- Advertisement -
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో మంగళవారం మధ్యాహ్నం మరో చిరుతపులి మరణించింది. 2022లో దేశంలో వీటిని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ తరహా ఘటన ఇది పదవది. మరనించిన నమీబియా చిరుత పేరు శౌర్య. పోస్టుమార్టమ్ తరువాతే దీని మరణానికి గల కారణం తెలుస్తుందని ఒక అధికారిక ప్రకటన పేర్కొంది. ఇప్పటివరకు ఏడు పెద్ద చిరుతలు, మూడు పిల్ల కూనలు కునో జాతీయ పార్కులో మరణించాయి. వివిధ ఇన్ఫెక్షన్ల కారణంగానే ఇవి మరణించినట్లు అధికారులు ఇప్పటివరకు చెబుతున్నారు. గత ఏడాది ఆగస్టు 2న కునో పార్కులో చివరిగా తొమ్మిదవ చిరుత మరణించింది. వర్షాకాలంలో క్రిమికీటకాల వల్లే సోకే ఇన్ఫెక్షన్ల కారణంగానే చివరిగా రెండు చిరుతలు మరణించినట్లు ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది.
- Advertisement -