Monday, November 25, 2024

సిద్దిపేటకు మరో జాతీయ కీర్తి

- Advertisement -
- Advertisement -

బెస్ట్ టూరిజం ప్రాంతంగా పెంబర్తితో పాటు చందల పూర్ ఎంపిక
జాతీయ టూరిజంలో మెరిసిన ఆ రెండు గ్రామాలు
గ్రామ ప్రజలను అభినందిస్తూ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు

మన తెలంగాణ / హైదరాబాద్ : సిద్దిపేట ఎన్నో జాతీయ అవార్డుల్లో ఆదర్శంగా నిలుస్తున్నది.. మరో గొప్ప జాతీయ కీర్తికి సిద్దిపేట ఎంపిక అయింది. తాజాగా జాతీయ పర్యాటక శాఖ టూరిజం అవార్డ్‌లను ఎంపిక చేసింది. తెలంగాణ రాష్ట్రం నుండి రెండు గ్రామాలు ఎంపిక కాగా ఒకటి పెంబర్తి, రెండో గ్రామం  సిద్దిపేట నియోజకవర్గంలోని చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్ గ్రామం. సిఎం కెసిఆర్ , మంత్రి హరీష్ రావు చొరవతో రంగనాయక స్వామి కొలువైన ప్రాంతంలో రంగనాయక కొండలు అద్భుతమైన ద్వీపంగా రంగానాయక సాగర్ రిజర్వాయర్ తో గొప్ప పర్యాటక ప్రాంతంగా విరాజిల్లుతోంది. నిత్యం పర్యాటకులతో కనువిందు చేస్తున్న ఈ ప్రాంతం.. ఇక్కడి ప్రకృతి.. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే దిశగా అవిష్కృతం అవుతోంది. కొద్ది రోజుల్లోనే మరో అద్భుతమైన గొప్ప డెస్టినేషన్ సెంటర్‌గా మారనుంది. అదే విధంగా ఈ ప్రాంతంలో నేసే ‘గొల్లభామ’ చీరలు తెలంగాణ కళాసంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. గొల్లభామ చీర.. తెలంగాణ నేతన్నల కళా నైపుణ్యానికి నిలువుటద్దం. కళాత్మకత, చేనేతల కలబోతకు నిదర్శనం. చేతిలో పెరుగు గురిగి, నెత్తిన చల్లకుండ, కాళ్లకు గజ్జెలు, నెత్తిన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం ఈ చీరల్లో ఇమిడిపోయి కనిపిస్తుంది.

సిద్దిపేట ప్రాంతంలోని చందలపూర్.. కనువిందు ప్రకృతి అందాలు , జల సందడి చేసే గొప్ప పర్యాటక ప్రాంతం రంగనాయక సాగర్ .. కళా నైపుణ్యత, సంస్కృతి గొల్లభామ చీర ప్రాచుర్యతకు నేడు జాతీయ స్థాయిలో దక్కిన గొప్ప గుర్తింపుగా ఇక్కడి ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు సంతోషం వ్యక్తం చేశారు.. సిద్దిపేట పర్యాటక , ఆహ్లాదకరమైన ప్రాంతంగా నెలవుగా మారిందనడానికి గొప్ప నిదర్శనం నేడు జాతీయ స్థాయిలో పర్యాటక ప్రాంతం చందలపూర్ గ్రామం అని, ఇది అందుకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు శుభాకాంక్షల తెలిపారు. కాగా మంత్రి హరీష్ రావు కృషి , పట్టుదలకు వారు అందించిన తోడ్పాటుకు ఈ గుర్తింపు అని జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ అన్నారు.. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావుకు కృతజ్ఞతలు తెలియజేసారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News