Thursday, January 23, 2025

రాజస్థాన్‌లో మరో నీట్ అభ్యర్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

జైపూర్ : నీట్ కు ప్రిపేర్ అవుతున్న 18 ఏళ్ల విద్యార్థి రాజస్థాన్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లో ఫేన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఈ సంఘటన జరిగింది. మృతుడు నితిన్ ఫౌజ్‌దార్ భరత్‌పూర్ జిల్లా నాద్‌బాల్ పట్టణానికి చెందిన వాడు. నీట్‌కు ప్రిపేర్ అవుదామని జూన్‌లో సికార్ వచ్చేడు. శనివారం కోచింగ్ సెంటర్ క్లాస్‌కు వెళ్లలేదని ఉద్యోగ్‌నగర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సురేంద్ర డేగ్రా తెలియజేశారు.

అయితే ఫౌజ్‌దార్ రూమ్‌మేట్ తమ రూమ్ లోపలి నుంచి తాళం వేసి ఉండడాన్ని గమనించి కిటికీ తెరిచి చూడగా, సీలింగ్ ఫ్యాన్‌కు ఫౌజ్‌దార్ మృతదేహం వేలాడుతూ ఉండడం చూశాడని స్టేషన్ హౌస్ ఆఫీసర్ తెలియజేశారు. సికార్‌లో గత మూడు రోజుల్లో ఈ విధంగా విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం రెండో సంఘటన. సెప్టెంబర్ 5 న 16 ఏళ్ల నీట్ అభ్యర్థి కౌశల్ మీనా హాస్టల్ రూమ్ లోనే ఫేన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్ కోటా లో ఈ ఏడాది ఇంతవరకు 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News