Sunday, January 19, 2025

కోటాలో మరో నీట్ అభ్యర్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కోటా : రాజస్థాన్ లోని కోటాలో నీట్ పరీక్షకు సిద్ధమౌతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. వక్ఫ్‌నగర్ ప్రాంతంలో తాను ఉంటున్న గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు పశ్చిమబెంగాల్‌కు చెందిన 20 ఏళ్ల ఫరీద్ హుస్సేన్‌గా గుర్తించారు. హుస్సేన్ గత ఏడాది నుంచి శిక్షణ కోసం స్థానికంగా ఓ వసతి గృహంలో స్నేహితులతో ఉంటున్నాడు. స్నేహితులతో కలిసి భోజనం చేసిన తరువాత గది నుంచి ఎంతసేపటికీ బయటకు రాలేదు.

ఫోన్ చేసినా స్పందించలేదు. ఈ సమాచారం తెలిసి పోలీస్‌లు వచ్చి గది తలుపులు తెరిచేసరికి ఉరివేసుకుని హుస్సేన్ కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. హుస్సేన్ గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ కనిపించలేదు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీస్‌లు వెల్లడించారు. మృతుని కుటుంబీకులకు సమాచారం అందించారు. ఈ సంఘటనతో ఈ ఏడాది కోటాలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 28 కి చేరింది. గత ఏడాది 15 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

కోటాలో విద్యార్థుల బలవన్మరణాలు పెరుగుతుండడంతో అధికారులు కోచింగ్ సెంటర్లతోపాటు హాస్టళ్లు, కిరాయికి ఇచ్చే గదుల్లో ఫ్యాన్లకు యాంటీ హాంగింగ్ పరికరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అదే విధంగా రెండు నెలల పాటు ఎలాంటి పరీక్షలు నిర్వహించరాదని కోచింగ్ సెంటర్లకు ఆదేశించారు. హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించారు. భవనాల చుట్టూ ఇనుప వలలు అమర్చారు. ఈ విధంగా ఎన్ని చర్యలు తీసుకుంటున్నా విద్యార్థుల బలవన్మరణాలు ఆగకపోవడం కలవరం కలిగిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News