- Advertisement -
జెనీవా : కరోనా వేరియంట్లు మరిన్ని పుట్టుకొస్తున్నాయి. సి.1.2 గా పిలిచే ఓ వేరియంట్ బయటపడినట్టు రెండు రోజుల క్రితమే తేలగా, మరో ఉత్పరివర్తనం తాజాగా ‘మూ’ అనే వేరియంట్‌ను గుర్తించినట్టు ప్రపంచ ఆరోఉగ్య సంస్థ వెల్లడించింది. ఈ ఏడాది జనవరిలో కొలంబియాలో ఇది బయటపడిందని పేర్కొంది. మూ ను వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్‌గా గుర్తించినట్టు వివరించింది. అయితే ఈ వేరియంట్‌కు టీకాలను ఏమార్చే గుణాలున్నాయని దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమని వెల్లడించింది. ఈ మూ వేరియంట్ బయటపడడంపై ప్రపంచ శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు. కరోనా నిబంధనలు సడలించిన ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి వల్ల ఈ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయని భావిస్తున్నారు.
- Advertisement -