Tuesday, January 21, 2025

టీచర్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు మరో అవకాశం

- Advertisement -
- Advertisement -

 

మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు భారత ఎన్నికల కమిషన్ మరో అవకాశం కల్పించింది. ఈ నెల 23వ తేదీ నుండి డిసెంబర్ 9 వరకు అర్హులైనవారు ఓటరు నమోదు చేసుకోవచ్చని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్ డిఎస్.లోకేష్ కుమార్ వెల్లడించారు. అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితా ఈ నెల 23వ తేదీన విడుదల చేయనున్నామని, ఈ జాబితా ఆధారంగా తమ తమ పేర్లను పరిశీలించుకోవాల్సిందిగా సూచించారు. ఈ జాబితాలో పేర్లు లేని వారితో పాటు అర్హత గలిగి ఇప్పటి వరకు ఓటరు నమోదు చేసుకోనివారు ఈ నెల 23 నుండి డిసెంబర్ 9 వరకు మరోసారి ఓటరు నమోదు చేసుకోవచ్చాని తెలిపారు.

భారత ఎన్నికల కమిషన్ కల్పించిన ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు రాష్ట్రంలో ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్ లో టీచర్ గా పనిచేస్తున్న వారు నవంబర్ 1, 2022 నాటికి కనీసం 3 సంవత్సరాల అనుభవం వరసగా (01-01-2016 నుండి 01-11- 2022 వరకు) 6 సంవత్సరాల సర్వీస్ కలిగి ఉండాలన్నారు. ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ లో ఎక్కడైనా పని చేసినప్పటికీ ఆ నియోజకవర్గంలో సాధారణ నివాసికి మాత్రమే ఓటరు జాబితాలో చేర్చడానికి అర్హులని పేర్కొన్నారు. ఓటరు నమోదులో ఏలాంటి సందేహాలు ఉన్న నివృత్తి చేసుకునేందుకు జిహెచ్‌ఎంసి టోల్ ఫ్రీ నెంబర్ 040- 21111111 ద్వారా ను సంప్రదించాల్సిందిగా జిల్లా ఎన్నికల అధికారి సూచించారు. తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News