Sunday, December 22, 2024

మాదాపూర్ కాల్పుల కేసులో మరో వ్యక్తి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

Another person arrested in Madhapur firing case

హైదరాబాద్: మాదాపూర్ కాల్పుల కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో మరో వ్యక్తిని సైబరాబాద్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఈ కాల్పుల కేసులో ఇప్పటివరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జహీరాబాద్ లో జిలానీ, మహ్మద్, ముజీబ్ లను పట్టుకున్నారు. నిందితులు మాదాపూర్ లో కాల్పులు జరిపి ఇస్మాయిల్ ను హత్య చేశారు. పాతబస్తీలోని ఓ ప్లాట్, జహీరాబాద్ లో భూ వివాదాలే కాల్పులకు కారణమని పోలీసులు తెలిపారు. రెండు భూ వివాదాలను పరిష్కరించుకునేందుకు ఇస్మాయిల్ ను మాదాపూర్ కు పిలిచి ముజీబ్ కాల్పి చంపాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News