Friday, January 24, 2025

రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరొకరి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో మరొక నిందితుడు పోలీసులకు చిక్కాడు. పోలీసులు పరారీలో ఉన్న డ్రగ్ పెడ్లర్ రెహ్మాన్ ను అరెస్ట్ చేశారు. రాడిసన్ డ్రగ్స్ కేసులో ఎ-13గా అబ్దుల్ రెహ్మాన్ ఉన్నాడు. ర్యాడిసన్ డ్రగ్స్ కేసులో రెహ్మాన్ అనే నిందితుడిని అరెస్ట్ చేశామని మాదాపూర్ డిసిపి వినీత్ తెలిపారు. రెహ్మాన్ తో పాటు ఢిల్లీకి చెందిన మరొకరిని అరెస్ట్ చేశామని ఆయన వెల్లడించారు. 11 గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్నామని డిసిపి వినీత్ చెప్పారు. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి హైదరాబాద్ లో విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. గోవా, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో కూడా డ్రగ్స్ అమ్ముతున్నారని చెప్పుకొచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News