Monday, December 23, 2024

సెప్టెంబర్‌లో మరో పిఎస్‌ఎల్‌వీ ప్రయోగం

- Advertisement -
- Advertisement -

శ్రీహరికోట : పీఎస్‌ఎల్‌వీ సీ 56 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ చెప్పారు. ఇదే శ్రేణిలో మరిన్ని ప్రయోగాలు చేపడుతున్నామన్నారు. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో మరో పీఎస్‌ఎల్‌వీ ప్రయోగం ఉంటుందని ఆయన తెలిపారు. గగన్‌యాన్, ఎస్‌ఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ మార్క్ 3 ప్రయోగాలకు సిద్ధమవుతున్నామని చెప్పారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఒకే నెలలో రెండు ప్రయోగాలను విజయవంతంగా చేపట్టింది. ఈనెల 14న చంద్రయాన్‌లో భాగంగా ఎల్‌విఎం3 రాకెట్‌ను చంద్రుని పైకి పంపింది. తాజాగా పీఎస్‌ఎల్‌వీ సీ 56 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఆదివారం ఉదయం 6.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలో ఉన్న షార్ నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ 56 రాకెట్ నింగి లోకి దూసుకెళ్లింది

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News