Monday, December 23, 2024

రాష్ట్రానికి మరో రూ.2 వేల కోట్ల రుణ సమీకరణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మరి కొంత సొమ్ము రుణంగా తీసుకోనున్నది. ఈ నెల 18వ తేదీన (మంగళవారం) రిజర్వ్‌బ్యాంక్ నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో తెలంగాణ రాష్ట్రాన్ని కేంద్రం అనుమతించడంతో.. రూ.2 వేల కోట్లను రుణంగా సమీకరించుకోనుంది. ఇందు కోసం 21, 23 ఏళ్ల కాలానికి రూ.1000 కోట్లు చొప్పన రాష్ట్ర ఆర్థిక శాఖ బాండ్లు జారీ చేసింది. వేలం అనంతరం రాష్ట్ర ఖజానాకు ఆ మొత్తం సమకూరుతుంది. తెలంగాణతో పాటు మరో ఎనిమిది రాష్ట్రాలు ఈ వేలం ద్వారా రూ. 12 వేల 430 కోట్ల రుణాలను సమీకరించనున్నాయి. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 1000 కోట్లు, తమిళనాడుకు రూ. 3 వేల కోట్లతో పాటు పలు రాష్ట్రాలు నిధులను బాండ్ల వేలంలో సమీకరించుకోనున్నాయి. రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ (ఈ- కుబేర్) విధానంలో ఈ వేలం నిర్వహించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News