Wednesday, January 22, 2025

4 వేల కోట్ల రుణానికి లైన్ క్లియర్?

- Advertisement -
- Advertisement -

Another Rs 4000 crore debt from Reserve Bank

నెలాఖరులోగా రైతుబంధు పథకానికి నిధులు
రాష్ట్ర ఆదాయం నుంచి నిధుల సర్దుబాటుతో విడుదలకు కసరత్తు

మనతెలంగాణ/ హైదరాబాద్ : రిజర్వ్‌బ్యాంక్ నుంచి మరో రూ.4 వేల కోట్ల నిధులను సమీకరించుకునేందుకు ఆర్థిక శాఖ తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. ఈ నెల 28వ తేదీన రిజర్వ్‌బ్యాంక్‌లో సెక్యూరిటీ బ్లాండ్లను వేలం వేసి.. నాలుగు వేల కోట్ల రూపాయల నిధులను సమీకరించుకునేందుకు అధికారులు ఆర్‌బిఐకి ప్రతిపాదనలు పంపించేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ నిధులు వస్తే.. రైతుబంధు పథకానికి, మరికొన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలకు కూడా నిధులను వినియోగించుకునే అవకాశం ఉంటుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. గత ఏప్రిల్, మే నెలలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అప్పుల సేకరణకు రిజర్వ్‌బ్యాంక్ అనుమతులు ఇవ్వకపోవడంతో దాదాపు రూ.10 వేల కోట్ల నిధులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు ఈ నెల 28వ తేదీన ఆర్‌బిఐలో జరగబోయే వేలంలో సెక్యూరిటీ బ్లాండ్లను అమ్మకానికి పెట్టి రూ.4 వేల కోట్ల నిధుల సమీకరణకు రిజర్వ్‌బ్యాంక్ ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా నిధుల సమీకరణకు సహకరించే అవకాశం ఉందని సీనియర్ అధికారులు అశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్థిక సంస్థల నుంచి కొత్త అప్పులతో పాటు రాష్ట్ర ఆదాయం నుంచి నిధులు సర్దుబాటు చేసి రైతుబంధు పథకానికి నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణ అప్పుల విషయంలో కఠిన వైఖరి అవలంభించిన మోడీ సర్కారు.. విద్యుత్, విద్య తదితర కేంద్ర చట్టాలకు రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గిన తర్వాత కాస్త మెత్తబడింది. బాండ్ల ద్వారా అప్పులు తీసుకునేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం అనుమతించింది. ఇటీవల రిజర్వ్‌బ్యాంక్ వేలం ద్వారా రూ.4 వేల కోట్లను అప్పు ద్వారా ప్ర భుత్వం నిధులను సమీకరించుకుంది. మళ్లీ ఈ నెలాఖరులో రు ణాల సమీకరించనున్నది. రెండు నెలలుగా అప్పులకు అవకా శం ఇవ్వకపోవడంతో నిధులు సర్దుబాటు చేయక రాష్ట్ర ప్రభు త్వం తీవ్రంగా ఇబ్బంది పడింది. రిజర్వ్‌బ్యాంక్ నుంచి కొత్త అ ప్పులు లభిస్తుండటంతో రాష్ట్ర సంక్షేమ పథకాలకు మళ్లీ జీవం వచ్చినట్లయింది. ముఖ్యమంత్రి కెసిఆర్ కలల పథకం రైతుబంధు డబ్బుల అందజేతకు రంగం సిద్ధమవుతోంది.

నైరుతి రుతుపవనాలు తెలంగాణ అంతటా విస్తరించడంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానాకాలం సీజన్ పంటలకు రైతులు ఇప్పటికే సమాయత్తం కాగా, వారికి పెట్టుబడి సాయంగా అందించే రైతుబంధు డబ్బుల అందజేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. 2018లో రైతుబంధు పథకం మొదలైనప్పుడు మే నెలలోనే రైతులకు డబ్బులు అందజేశారు. వానాకాలం అయితే జూన్, జూలైలో, యాసంగి పంటలకైతే జనవరి, ఫిబ్రవరి నెలల్లో రైతుబంధు ఇస్తోంది. ఇప్పటి వరకు 66.61 లక్షల మంది రైతులకు ఈ లబ్ధి కల్పించారు. 2022 జూన్ సీజన్‌లో పట్టాదారుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం దానికి తగ్గట్లుగా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ సారి రైతుబంధు కోసం రూ.7,700 కోట్లు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఈ మొత్తాన్ని విడతల వారీగా అందించనుంది. అందుబాటులో ఉన్న అన్ని వనరుల ద్వారా నిధులు సమీకరించుకున్న ప్రభుత్వం జులై మొదటి వారంలోగా రైతుల ఖాతాలో నిధులు జమ చేయనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News