Monday, December 23, 2024

మరో రష్యా నౌకను ధ్వంసం చేసిన ఉక్రెయిన్ డ్రోన్

- Advertisement -
- Advertisement -

కీవ్ : రష్యాకు చెందిన భారీ ల్యాండింగ్ నౌక సీజర్ కునికోవ్‌ను ధ్వంసం చేసినట్టు ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ బుధవారం ప్రకటించింది. క్రిమియా జలాల్లో ఈ దాడి జరిగినట్టు వెల్లడించింది. ఈ నౌకపై మాగురావీ 5 శ్రేణి సముద్ర డ్రోన్లతో స్పెషల్ ఫోర్స్ లోని యూనిట్ 13 దాడి చేసినట్టు తెలిపింది. దీంతో ఆ నౌక మునిగిపోయింది. ఇక్కడ రష్యా దళాలు సహాయ కార్యక్రమాల కోసం హెలికాప్టర్లను కూడా ఉపయోగించినట్టు స్థానిక మీడియా కథనాలు చెబుతున్నా రష్యా మాత్రం ఎలాంటి ప్రకటన చేయలేదు.

సిరియా, జార్జియా, ఉక్రెయిన్ యుద్ధాల్లో కీలక పాత్ర పోషించిన ఈ నౌక 87 మంది సిబ్బందిని తీసుకెళ్ల గలదు. ఫిబ్రవరి నెల లోనే ఉక్రెయిన్ రెండు రష్యా నౌకలను ముంచినట్లైంది. ఈనెల 1న ఒక మిసైల్ బోటును ధ్వంసం చేసింది. ఈ సందర్భంగా ఉక్రెయిన్ సెక్రటరీ జనరల్ జేన్స్ స్టోలెన్‌బెర్గ్ మాట్లాడుతూ రష్యా నల్ల సముద్ర దళం భారీగా దెబ్బతినడంతో ఉక్రెయిన్ ధాన్యం ఎగుమతుల కారిడార్ సాధ్యమైందని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News