Tuesday, July 2, 2024

మద్దతు ధరలతో మరో వంచన

- Advertisement -
- Advertisement -

మోదీ నాయకత్వాన ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం మరోసారి మద్దతు ధరల పెంపు నాటకాన్ని ప్రదర్శించింది. 20–6-2024న 14 పంటలకు మద్దతు ధరను పెంచుతూ ప్రకటన చేసింది. మద్దతు ధర పెంపు వలన గత సంవత్సరం కన్నా 35 వేల కోట్ల రూపాయలు అధనంగా రైతాంగానికి ప్రయోజనం కలుగుతుందని అధికారులు ప్రకటించారు. సాగు, కమిషన్ (సిఎసిపి) సిఫార్సులకు అనుగుణంగా పెంచిన మద్దతు ధరలు ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అమల్లోకి వస్తాయని, సమాచార, ప్రచారాల మంత్రి అశ్వని వైష్ణవ్ చెప్పారు.

పెంచిన పంటల మద్దతు ధరలను గమనిస్తే ధాన్యానికి క్విటాల్ పై పెరిగింది 117 రూపాయలు(5.3%) మాత్రమే.పెరిగిన ధర కన్నా సేద్యానికి కావాల్చిన ఎరువుల, విత్తనాల, పురుగుమందుల, డీజిల్ ధరల పెరుగుదల ఎక్కువగా ఉంది. ఫలితంగా సేద్యపు ఖర్చు పెరిగిం పెరిగిన సేద్యపు ఖర్చుల దృష్ట్యా, పెంచిన మద్దతు ధర లు రైతాంగానికి ఊరట నివ్వదు. అలాగే పత్తి ఇతర పంటలకు పెంచిన మద్దతు ధరలు కూడా రైతాంగ ప్రయోజనాలను కాపాడే విధంగా లేవు. అనుసరిస్తున్న మద్దతు ధరల విధానమే రైతాంగ ప్రయోజనాలను హరిస్తున్నది.మోదీ ప్రభుత్వం పంట ఖర్చులపై అధనంగా 50% పెంచుతానని చెప్పి, మోసపూరితంగా పంట ఖర్చు ను నిర్ణయిస్తున్నది.

రైతు సేద్యపు ఖర్చు అంటే ఎకరాకు బ్యాంకులు ఇచ్చే అప్పును మాత్రమే మోదీ ప్రభుత్వం ప్రకటించి దానిపై యాబై శాతం పెంచినట్లు ప్రచారం చేసుకుంటున్నది. సేద్యపు ఖర్చు అంటే పంటపై పెట్టిన పెట్టుబడితో పాటు కౌలు ఖర్చు , కుటుంబ శ్రమ, అప్పులకు వ డ్డీ కలసి మొత్తంగా ఉంటుంది. ఈ విధంగా కొన్ని పంటల ఖర్చు, దిగుబడి, మద్దతు ధర, వచ్చే ఆదాయం పరిశీలిద్దాం. వరి ఎకరా పంట పెట్టుబడి 32 వేలు,కుటుంబ శ్రమ, అప్పుల వడ్డీ కలసి కనీసంగా 10వేలు. కౌలు రైతు కు అధనంగా కౌలు ఖర్చు 15 వేలు ,మొత్తం ఖర్చు 57 వేలు. దీనిపై 50% పెంచితే రైతుకు 83వేలుగా మద్దతు ఉండాలి. ఎకరా సగటు ధ్యాన్యం దిగుబడి 24 క్వింటా ళ్లు. దీని ప్రకారం క్వింటాళ్ ధాన్యం మద్దతు ధర 3458 రూపాయలుగా ఉండాలి. మోదీ ప్రభుత్వం ప్రకటించింది 2320 రూపాయలు.ఈ మద్దతు ధర ప్రకారం వచ్చే ఆదాయం 55,680 రూపాయలు. ఈ ధర వలన కౌలు రైతులకు పెట్టుబడికూడా రాదు.

సొంత భూమి రైతులకు స్వల్ప మిగులు మాత్రమే ఉంటుంది. పత్తి తదితర పంటలకు కూడా ఇదే పరిస్థితి ఉంది.ప్రపంచ బ్యాంక్ సూచనల మేరకు అధిక దిగుబడుల కోసమంటూ దేశం పాలకులు 1966లో హరిత విప్లవాన్ని ప్రారంభించారు.అందుకోసం ఎరువులు, విత్తనాలు దిగుమతి చేసుకున్నారు. సాంప్రదాయ విత్తనాల వినియోగం తగ్గుముఖం పట్టింది. విదేశీ రసాయనిక ఎరువుల కొనుగోల్లకు స్రపంచ బ్యాం కు ఆర్థిక సహాయాన్ని ఆ నాటి ప్రభుత్వానికి అందించింది. రైతాంగ ప్రయోజనం కోసమంటూ 1966-67 లో మొదటి సారి పంటలకు మద్దతు ధరలను కేంద్ర ప్రభు త్వం ప్రకటించింది. పాలకుల హరిత విప్లవం రైతాంగం పంటలకు న్యాయమైన ధరలు కల్పించ లేకపోయినా, సామ్రాజ్యవాదులకు వ్యవసాయ రంగంపై ఆదిపత్యం, బహుళజాతి సంస్థల విత్తన,ఎరువుల వ్యాపారానికి మాత్రం మంచి అవకాశం కల్పించింది.
మహారాష్ట్ర, జార్ఖండ్, హర్యాన రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు కొద్ది నెలల్లోనే జరగనున్న నేపధ్యంలో పంటల ధరలు పెంచటమన్నది గమనించాల్సిన అంశం.

మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల ఎడల రైతాంగంలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఇది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టమైంది. ఇప్పుడు ఈ మూడు రాష్ట్రాల్లోను ఎన్‌డీఏ వ్యతిరేకత రైతాంగంలో వ్యక్తమౌతున్నది. దీన్ని గమనించిన మోదీ ప్రభుత్వం, వ్యతిరేకతను దారి మల్లించి ఓట్ల లబ్ది పొందేందుకే నామ మాత్రపు పంటల ధరల పెంపు. ఇంతకు ముందు కూడా ఎన్నికల్లో లబ్ది కోసం గ్యాస్ ధర తగ్గింపు, మహిళా రిజర్వేషన్ చట్ట అమలుకు పార్లమెంట్ ఆమోదం , హిందువుల ఓట్లు పొందేందుకు పౌరసత్వ సవరణ చట్టాన్ని అమల్లోకి తేవటం కూడా జరిగింది. మోదీ ప్రభుత్వానికి రైతాంగ ప్రయోజనాలు కాపాడే ఉద్దేశమే ఉంటే పంటలకు న్యాయమైన ధరలు ప్రకటించి, వాటికి చట్టబద్దత కల్పించి ఉండేది. ఆ ఉద్దేశం లేదు కాబట్టే రైతుల ఆ డిమాండ్‌ను మొండిగా పక్కన పెట్టింది.

రైతాంగాని ప్రోత్సాహం లేక పోవ వలన పప్పు ధాన్యా ఉత్పత్తిలో అభివృద్ధి లేక 2022-23లో 26.5లక్షల టన్నుల పప్పు ధాన్యాలను దిగుమతి చేసుకున్నాము. ఇందు కోసం మూడు కోట్ల, 74 లక్షల డాలర్లు చెల్లించాము. 2022- 2023లో వంట నూనెల వినియోగం 24% పెరిగి 141.22 లక్షల టన్నులకు చేరుకుంది. 2024 ఎప్రిల్ నాటికి దేశం మొత్తంమీద వంట నూనెల దిగుమతి 11.49 లక్షల టన్నులుగా ఉంది. ఇందుకు 1.56 లక్షల కోట్లు చెల్లింది. 2023లో వం నూనెల దిగుమతులు 10లక్షల, 76 టన్నులుగా ఉంది. 2021-22 మార్కెట్ సంవత్సరంలో దేశం మొత్తం మీద నూనె ల దిగుమతి 11లక్షల,45వేల టన్నులకు చేరాయని సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టెర్స్ అసోషియోషన్ ఆఫ్ ఇండియా ( ఎస్‌ఏఈ) పేర్కొంది.
దేశంలో వంట నూనెల వినియోగం, ఉత్పత్తి, దిగుమతులు ఈ విధంగా ఉన్నాయి
సంవత్సరం దేశ లభ్యత దిగుమతి వినియోగం
2017-18 1.04 1.46 – 2.50
2018-19 – 1.03 – 1.55 – 2.59
2019-20 1.06 – 1.34 – 2.40
2020-21 – 1.11 – 1.42 – 2.38
ఈ లోని వివరాలు గమనించి నప్పుడు 60% పైగా నూనెలు విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాము. దేశీయ ఉత్పత్తి లో పెరుగుదల లేదని స్వయం సమృద్ది సాధించలేదని స్పష్టమైంది.
నూనెల దిగుమతికి చెల్లించిన మొత్తం
సంవత్సరం చెల్లించిన మొత్తం
2019-20 – 0.72 లక్షలు కోట్లు
2020-21 – 1.17 లక్షల కోట్లు
2021- 22 – 1.56 లక్షల కోట్లు

దిగుమతుల కోసం 2019 నుంచి పెరుగుతూ వచ్చిన ఖర్చు ఈ పట్లిక ద్వారా వెల్లడౌతున్నది. పప్పు ధాన్యాల, నూనె గింజల స్వయం సమృద్ది సాధించి ఉంటే లక్షల కోట్ల డబ్బులు ఆదా అయ్యేది. ఆ డబ్బులను నీటి ప్రాజెక్టుల, పారిశ్రామిక అభివృద్ధికి ఉపయోగిస్తే దేశ అభివృద్ది ముందుకు సాగేది. దేశ పాలకులకు ఆ విధానమే లోపించింది .గత ప్రభుత్వాల, నేటి మోడీ ప్రభుత్వం దేశీయ వ్యవసాయాన్ని, రైతుల ప్రయోజనాలను కాపాడే విధానాలు అమలు జరపకుండా, సామ్రాజ్యవాదుల, బహుళజాతి సంస్థల ప్రయోజనాలు కాపాడుతూ, వ్యవసాయాన్ని దం డగగా మార్చి చిన్న సన్న కారు రైతుల భూములను కార్పొరేట్, కాంట్రాక్ట్ వ్య వసాయానిక కట్టబెట్ట చూస్తున్నది. అం దులో భాగమే పంటలకు న్యాయమైన ధరలు ప్రకటించి చట్టబద్దత కల్పించక పోవటం. పంటలకు న్యాయమైన ధర లు ప్రకటించి, చట్టబద్దత కల్పించాలని, పప్పు ధా న్యాల, నూనె గింజల రైతుల ను ప్రోత్సహించి,నూనెల్లో స్వయం సమృద్ది సాధించాలని యావన్మంది భారత రైతాంగం ఉద్యమించాలి.

పంటలు         2023-24 2024-25 పెరిగింది
వరి సాదా        2183 – 2300 – 117
వరి ఏగ్రేడ్        2203- 2320 – 117
పత్తి మధ్యరకం  6620- 7021 – 501
పొడవు రకం    7020- 7521 – 501
కంది            7000- 7550- 550
పెసర            8558- 8682- 124
సోయాబిన్      4600- 4892 – 292
నువ్వులు       8365- 9267 -632
మొక్కజొన్న    2090- 2225 135
వేరుశనగ        6377 -6783 – 406
జొన్న హైబ్రీడ్   3180- 3371 191
జొన్న          3225 – 3416 -191
మినుములు    6950- 7400 – 450
పొద్దుతిరుగుడు 6760 – 7400 – 640
రాగులు         3846- 4290  -444

బొల్లిముంత సాంబశివరావు
9885983526

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News