Wednesday, January 22, 2025

కాంగ్రెస్‌కు మరో షాక్

- Advertisement -
- Advertisement -
మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి దూరం

హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి షాక్‌లు తగులుతున్నాయి. సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే సినీ నటి జయసుధ బిజెపి పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆమెతో పాటు మరో ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు కూడా కమలం తీర్థం పుచ్చుకుంటారని చెబుతున్నాయి. చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సంజీవరావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవిలు… కిషన్‌రెడ్డితో సమావేశం జరిపి త్వరలో కాషాయం కండువా కప్పుకోనున్నట్లు బిజెపి సీనియర్లు వెల్లడిస్తున్నారు. ఆగస్టు నుంచి తమ పార్టీలోకి పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల నుంచి వలసలు ఉంటాయని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కేంద్రం, రాష్ట్రంలో కమలం పార్టీ అధికారం చేపడుతుందని బిజెపి నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News