Monday, December 23, 2024

మార్గదర్శికి మరో భారీ షాక్..

- Advertisement -
- Advertisement -
ఈ సారి రూ.242 కోట్ల ఆస్తుల అటాచ్

హైదరాబాద్ : మార్గదర్శి అక్రమాల కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మరోసారి మార్గదర్శి చిట్స్‌కి చెందిన ఆస్తులను ఎపి సిఐడి భారీగా అటాచ్ చేసింది. ఈ సారి ఏకంగా రూ.242 కోట్ల విలువైన 40 చరాస్తులను అటాచ్ చేసినట్లు తెలుస్తోంది. మార్గదర్శి అక్రమాల కేసులో ఇప్పటికే దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్న ఎపి సిఐడి ఆ కంపెనీ అధినేత, ఎండి అయిన రామోజీరావు, శైలజా కిరణ్‌లను పలుమార్లు విచారించిన సంగతి విదితమే.

మార్గదర్శి చిట్‌ఫండ్స్ చందాదారులు, డిపాజిట్‌దారుల ప్రయోజనాల పరిరక్షణే లక్షంగా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనూ ఇలాంటి కీలక నిర్ణయం తీసుకుంది. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌కు చెందిన రూ.793.50 కోట్ల విలువైన చరాస్తులను జప్తు చేసేందుకు సిఐడిని అనుమతించింది. వాటిలో మార్గదర్శి చిట్‌ఫండ్స్, నగదు, బ్యాంకు ఖాతాల్లో సొమ్ము, నిబంధనలకు విరుద్ధంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టిన పెట్టుబడులున్నాయి.

కేంద్ర చిట్‌ఫండ్స్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ మార్గదర్శి చిట్‌ఫండ్స్ దశాబ్దాలుగా ఆర్థిక అక్రమాలకు పాల్పడుతున్నట్లు స్టాంపులురిజిస్ట్రేషన్ల శాఖ తనిఖీల్లో వెల్లడైంది. చందాదారుల సొమ్మును నిబంధనలకు మార్గదర్శి తమ అనుబంధ సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు మళ్లించినట్లు కీలక ఆధారాలు సేకరించింది. చిట్‌ఫండ్స్ రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు ఎ1గా చెరుకూరి రామోజీరావు, ఎ2గా చెరుకూరి శైలజ కిరణ్‌లతో పాటు బ్రాంచి మేనేజర్లపై(ఫోర్‌మెన్) సిఐడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర చిట్‌ఫండ్ చట్టాన్ని అనుసరిస్తున్నట్లు ఆధారాలు చూపితే కొత్త చిట్టీలకు అనుమతిస్తామని స్టాంపులురిజిస్ట్రేషన్ల శాఖ సూచించినా మార్గదర్శి అందుకు నిరాకరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News