Monday, December 23, 2024

మణిపూర్‌లో మరో షాకింగ్ వీడియో వైరల్

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్ : ఇప్పటికే హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మరో షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తలనరికి కంచెకు వేలాడదీసిన వీడియో క్లిప్ తాజాగా వైరల్‌గా మారింది. మణిపూర్‌లో కొందరు అల్లరిమూక ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వైరల్ అయి.. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. దానిని మరువక ముందే ఈ దారుణ సంఘటన జులై 2న బిష్ణుపూర్ జిల్లాలో చోటుచేసుకంది. అర్ధరాత్రి వేళ జరిగిన ఘర్షణలో కుకీ వర్గానికి చెందిన నలుగురిని మైతీ వర్గానికి చెందిన వారు దారుణంగా చంపారు. డేవిడ్ థీక్ అనే వ్యక్తి తల నరికి.. ఆ ప్రాంతంలో వెదురు కర్రలతో చేసిన కంచెకు అతడి తలను వేలాడదీశారు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News