Wednesday, January 22, 2025

జెయు విద్యార్థి మృతి కేసులో మరో విద్యార్థికి పోలీసు కస్టడీ

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : జాదవ్‌పూర్ యూనివర్శిటీ విద్యార్థి మరణానికి సంబంధించిన కేసులో మరో వ్యక్తిని ఈ నెల 24 వరకూ పోలీసు కస్టడీకి తరలించారు. ఈ మేరకు కోల్‌కతా కోర్టు ఆదేశాలు వెలువరించింది. ఇప్పటివరకూ ఈ కేసుకు సంబంధించి 13 మందిని అరెస్టు చేశారు. ఇప్పుడు అరెస్టు అయిన వ్యక్తి జాదవ్‌పూర్ యూనివర్శిటీలో గత విద్యార్థి. నిందితుడిపై ఐపిసి సెక్షన్ 353 పరిధిలో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు సిద్ధం అయ్యారు.

అండర్‌గ్రాడ్యుయెట్ విద్యార్థులను ర్యాగింగ్ చేయడం, వారిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు ఎక్కువగా ఈ వర్శిటీలో చోటుచేసుకుంటున్నాయి. ర్యాగింగ్‌కు తట్టుకోలేక విద్యార్థిహాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పైగా ఘటనా స్థలికి పోలీసులు అధికారులు సకాలంలో చేరకుండా సీనియర్లు గేటుకు తాళం వేసి అడ్డుకున్నారని అభియోగాలు వెలువడ్డాయి. కాగా 17 ఏండ్ల విద్యార్థి మరణంపై యుజిసి తీవ్రంగా స్పందించింది. పూర్తి స్థాయి నివేదిక అందించాలని ఈ వర్శిటీని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News