Sunday, December 22, 2024

ఐఐటిలో మరో విద్యార్థి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Another student commits suicide in IIT Hyderabad

సంగారెడ్డి: హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)కి చెందిన మరో విద్యార్థి బుధవారం సంగారెడ్డిలోని లాడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం.. మృతుడు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌కు చెందిన మేఘా కపూర్‌గా గుర్తించారు. మూడు నెలల క్రితం ఐఐటీ హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేశారు. పోలీసులు మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటన విద్యార్థులు, తల్లిదండ్రుల్లో భయాందోళనకు గురి చేసింది. అంతకుముందు, ఆగస్టు 31న హాస్టల్ గదిలో రాహుల్ అనే విద్యార్థి అనుమానాస్పదంగా ఉరి వేసుకుని కనిపించిన ముచ్చట తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News