Sunday, December 22, 2024

నేను ఓడిపోయానంటూ.. కోటాలో మరో విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

కోటా ( రాజస్థాన్) : రాజస్థాన్ లోని కోటాలో జెఈఈ మెయిన్స్‌కు సిద్ధమౌతున్న 18 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ పోటీ పరీక్షలో తాను ఉత్తీర్ణత సాధించలేనంటూ తల్లిదండ్రులకు సూసైడ్ నోట్‌లో తెలియజేసింది. సోమవారం తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా, అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను పోలీస్‌లు గుర్తించారు.

“ అమ్మా నాన్నా.. నేను జేఈఈ చదవ లేను. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను ఓడిపోయాను . నన్ను క్షమించండి ” అని అందులో రాసి ఉన్నట్టు పోలీస్‌లు తెలిపారు. ఆమె జనవరి 31న పరీక్ష రాయాల్సి ఉంది. తీవ్ర మానసిక ఒత్తిడి వల్లనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీస్‌లు వెల్లడించారు. కోటా విద్యార్థులకు సంబంధించి ఈ ఏడాదికి ఇది రెండో సంఘటన. జనవరి 23న ఒక ప్రైవేట్ కోచింగ్ సెంటర్‌లో నీట్‌కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థి తన గదిలో ఉరి వేసుకున్న సంగతి తెలిసిందే. గత ఏడాది కోటాలో 20 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడానికి కేంద్రం అనేక సూచనలతో ఏర్పాట్లు చేయించినా మరణాలు తగ్గడం లేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News