Friday, November 22, 2024

కోటాలో మరో విద్యార్థి అదృశ్యం

- Advertisement -
- Advertisement -

కోటా (రాజస్థాన్ ): విద్యార్థుల వరుస ఆత్మహత్యలతో వార్తల్లో నిలుస్తోన్న రాజస్థాన్ లోని కోటా లో మరో సంఘటన చోటు చేసుకుంది. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతోన్న ఓ విద్యార్థి అదృశ్యమయ్యాడు. దానికి ముందు పంపిన సందేశంతో అతడి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. పోలీస్‌లు వెల్లడించిన వివరాల ప్రకారం ఆ విద్యార్థి పేరు రాజేంద్ర మీనా. అతడిది రాజస్థాన్ లోని బమన్‌వాస్ ప్రాంతం . రాజేంద్ర నుంచి వచ్చిన సందేశం ఆధారంగా అతడి తండ్రి జగ్‌దీశ్ మీనా పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు.

“ నేను ఇంటికి రాను. వెళ్లి పోతున్నాను. పై చదువులు చదవాలని లేదు. నావద్ద రూ.8 వేలు ఉన్నాయి. ఐదు సంవత్సరాల వరకు తిరిగి రాను, నా ఫోన్ అమ్మేస్తాను. నేను ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోను. నా గురించి బాధపడొద్దని అమ్మకు చెప్పండి. నా దగ్గర మీ అందరి ఫోన్ నంబర్లు ఉన్నాయి. ఏడాదికి ఒకసారి తప్పకుండా ఫోన్ చేస్తాను. ” అని తన ఫోన్ నుంచి కుటుంబానికి మెసేజ్ చేశాడు. మే ఆరు నుంచి అతడు కనిపించడం లేదని ఆరోజు మధ్యాహ్నం తన హాస్టల్ వదిలి వెళ్లి పోయాడని తండ్రి జగదీశ్ తెలిపారు. ప్రస్తుతం ఆ విద్యార్థి కోసం గాలిస్తున్నారు. అతడు నీట్ కోచింగ్ కోసం కోటా వచ్చాడని పోలీస్‌లు తెలిపారు. గత ఆదివారం దేశ వ్యాప్తంగా ఆ ప్రవేశ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News