Wednesday, January 22, 2025

జమ్మూ బేస్ క్యాంప్ నుంచి అమర్‌నాథ్‌కు మరో బృందం

- Advertisement -
- Advertisement -

జమ్మూ : కాశ్మీర్ హిమాలయాల్లో వార్షిక అమర్‌నాథ్ యాత్రలో చేరేందుకు 6619 మందితో మూడవ బృందం జమ్మూలోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి రెండు వేర్వేరు వాహన సముదాయాల్లో బయలుదేరినట్లు అధికారులు ఆదివారం వెల్లడించారు. 52 రోజుల వార్షిక యాత్ర తొలి రోజు దాదాపు 14 వేల మంది యాత్రికులు 3880 మీటర్ల ఎత్తున గల పవిత్ర గుహాలయంలో ప్రార్థనలు జరిపారని అధికారులు తెలిపారు.

1141 మంది మహిళలతోసహా మూడవ బృందం గట్టి భద్రత నడుమ ఆదివారం తెల్లవారు జామున 3.50, 4.45 మధ్య 319 వాహనాల్లో బయలుదేరింది. యాత్రికులు కాశ్మీర్‌కు బయలుదేరినప్పుడు జమ్మూలో వర్షం పడుతోందని అధికారులు తెలిపారు. యాత్ర కోసం 3838 మంది భక్తులు పహల్‌గామ్ మార్గాన్ని, 2781 మంది బల్తాల్ మార్గాన్ని ఎంచుకున్నారని వారు తెలిపారు. ఈ యాత్ర ఆగస్టు 19న ముగియనున్నది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News