- Advertisement -
పాకిస్తాన్ లో మరో ఉగ్రవాది అనుమానాస్పదస్థితిలో మరణించాడు. యునైటెడ్ జీహాద్ కౌన్సిల్ కు ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ షేక్ జమీల్ ఉర్ రహ్మాన్ మృతదేహాన్ని అబోటాబాద్ నగరం శివార్లలో పోలీసులు కనుగొన్నారు. తెహ్రీక్ ఉల్ ముజాహిదీన్ ఉద్రవాద సంస్థకు కూడా జమీల్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. కశ్మీర్ లోని పుల్వామాకు చెందిన జమీల్ చాలా ఏళ్లక్రితం పాక్ కు పారిపోయి, ఉగ్రవాద కార్యకలాపాల్లో శిక్షణ పొంది, నాయకుడిగా ఎదిగాడు. జమీల్ మృతికి కారణాలు ఇంకా తెలియరాలేదు. పాకిస్తాన్ లో తలదాచుకున్న పలువురు ఉగ్రవాదులు ఇటీవల వరుస దాడుల్లో కన్నుమూయడంతో, జమీల్ కూడా హత్యకు గురై ఉండవచ్చునని భావిస్తున్నారు.
- Advertisement -