Monday, December 23, 2024

భాగ్యనగర్‌తో ‘ఉగ్ర’ కుట్ర కేసు… మరో ఉగ్రవాది సల్మాన్ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

హార్డ్ డిస్కులు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం
దేశంలో షరియా చట్టం అమలుకు హెచ్‌యూటి వ్యూహం!?

హైదరాబాద్ : భాగ్యనగర్‌తో సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ‘ఉగ్ర’ కుట్ర కేసులో ఎన్‌ఐఏ అధికారులు మరో ఉగ్రవాది సల్మాన్‌ని హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మంగళవారం అరెస్ట్ చేశారు. అతనికి చెందిన రెండు ఇళ్లల్లో తనిఖీలు జరిపి ఎలక్ట్రానిక్ పరికరాలు, హార్డ్ డిస్కులు, కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు రెండు నెలల క్రితం కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు మధ్యప్రదేశ్ ఎటిఎస్(యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్) పోలీసులు భోపాల్‌లో హెచ్‌యూటి (హిజ్బ్-ఉత్ -తహ్రీర్)కు చెందిన 11 మందిని అరెస్ట్ చేసిన సంగతి విదితమే. దీంట్లో ప్రధాన సూత్రధారి యాసిర్‌ను విచారించగా హైదరాబాద్‌లో కూడా తమ వాళ్లు ఉన్నట్టు తెలపడంతో హైదరాబాద్ వచ్చిన భోపాల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అధికారులు తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ సిబ్బందితో కలిసి మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు.

దర్యాప్తు లోఉగ్రవాదుల నెట్వర్క్ వేర్వేరు రాష్ట్రాలకు విస్తరించి ఉన్నట్టు వెల్లడైన క్రమంలో ఎన్‌ఐఎ రంగంలోకి దిగింది. భోపాల్ ఎటిఎస్ పోలీసులు హైదరాబాద్‌లో ఉంటున్న వారిపై నిఘా ఏర్పాటు చేశారు. మధ్యప్రదేశ్ ఎటిఎస్ పోలీసులు తెలంగాణకు చెందిన కౌంటర్ ఇంటలిజెన్స్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రెండు రాష్ట్రాలకు చెందిన పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మోతీలాల్ స్టేడియం సహా పలు ప్రాంతాల్లో హెచ్‌యూటి పేలుళ్లకు ప్లాన్ చేశారని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. విదేశాల నుండి వస్తున్న వాయిస్ మేసేజ్ ల ఆధారంగా నిందితుల ప్లాన్‌ను దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
హెచ్‌యూటీకి చెందిన యాక్టివ్ పర్సన్ ఉగ్రవాది సల్మాన్..
సల్మాన్ హెచ్యూటీకి చెందిన యాక్టివ్ పర్సన్ అని ఎన్‌ఐఎ అధికారులు చెప్పారు. ఇతను ఇప్పటికే అరెస్టు అయిన సలీం ఆదేశానుసారం పనిచేసేవాడని వెల్లడించారు. వీళ్లు హెచ్యూటీని హైదరాబాద్ లో విస్తరించేందుకు పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. దేశంలో షరియా చట్టం అమలుకు హిజ్బ్ ఉత్ తహ్రీర్ కుట్ర చేసినట్లు తెలుస్తోంది. మే 24న రిజిస్టర్ అయిన ఈ కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తును కొనసాగిస్తోంది. మొత్తం ఈ కేసు ఒక కొలిక్కి వచ్చే వరకు దర్యాప్తు ముమ్మరంగా సాగుతుందని ఎన్‌ఐఎ పేర్కొంది.
భోపాల్, హైదరాబాద్ కేంద్రంగా హెచ్‌యూటీ కార్యకలాపాలు..
మధ్యప్రదేశ్‌లోని భోపాల్, తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా హిజ్బ్ – ఉత్ – తహ్రీర్ కార్యకలాపాలు నిర్వహించినట్టు ఎన్‌ఐఏ విచారణలో వెల్లడైంది. ఈ ఏడాది మే 24న హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించిన సంగతి విదితమే. ఆ సమయంలో మధ్యప్రదేశ్, తెలంగాణలో మొత్తం 16 మందిని అరెస్టు చేయగా తాజాగా సల్మాన్ అరెస్టుతో ఆ సంఖ్య 17కు చేరింది మే 24న హైద్రాబాద్‌లో సలీమ్, మరో ముగ్గురిని ఎన్‌ఐఏ అరెస్టు చేసిన సంగతి విదితమే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News