Monday, December 23, 2024

మరో మూడ్రోజులు భారీ వర్షాలు

- Advertisement -
- Advertisement -

16జిల్లాలకు ఎల్లో అలర్ట్
అప్రమత్తంగా ఉండాలని ఐఎండి హెచ్చరిక

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రాగల మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. రాష్ట్రంలో హైదరాబాద్‌తోపాటు 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఎల్లో అలర్ట్ జారీ చేసిన 16 జిల్లాల్లో లోతట్టు, ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

జార్ఖండ్ పరిసరాల్లో ఉన్న అల్పపీడనం ఛత్తీస్‌గఢ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సగటున సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యా పించి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోకి దిగువ స్థాయిలోని గాలులు పశ్చిమ దిశ నుండి వీస్తున్నాయని వివరించింది. గడిచిన 24 గంట ల్లో నల్లగొండ జిల్లాలోని కనగల్లో 77.5మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈనెల 25న రాజస్థాన్‌లో నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబర్ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News