Monday, January 20, 2025

కూలిన మరో శిక్షణ విమానం

- Advertisement -
- Advertisement -

పుణె: నాలుగు రోజుల వ్యవధిలో మహారాష్ట్రలో మరో శిక్షణ విమానం కూలింది. పుణె జిల్లాలో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. పోలీస్‌లు వెల్లడించిన వివరాల ప్రకారం…రెడ్‌బర్డ్ అకాడమీకి చెందిన విటిఆర్‌బిటి ఎయిర్ క్రాఫ్ట్ ట్రైనింగ్ సెషన్‌లో ఉన్న సమయంలో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమం లోనే గోజుబవి గ్రామ సమీపంలో అది కూలింది.

ఈ ప్రమాదంలో పైలట్, కో పైలట్ గాయాలతో బయటపడ్డారు. వెంటనే క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఎ) తెలిపింది. ఈ ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ అకాడమీకి చెందిన శిక్షణ విమానం ప్రమాదానికి గురికావడం నాలుగు రోజుల వ్యవధిలో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇటీవల జరిగిన ప్రమాదంలో సీనియర్ పైలట్ సహా కో పైలట్ తీవ్రంగా గాయపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News