- Advertisement -
భారీ చొరబాటు కుట్ర భగ్నం చేసిన బిఎస్‌ఎఫ్
జమ్ము: భారత్-పాకిస్థాన్ మధ్య అంతర్జాతీయ సరిహద్దులో మరో రహస్య సొరంగాన్ని బిఎస్‌ఎఫ్ గుర్తించింది. కథువా జిల్లాలోని హీరానగర్ సెక్టార్‌లో 150 మీటర్ల పొడవు, 30 మీటర్ల లోతు, 3 మీటర్ల వ్యాసంతో కూడిన సొరంగాన్ని గుర్తించారు. దీంతో, భారత్‌లోకి ఉగ్రవాదుల్ని చేరవేసే పాక్ కుట్ర బట్టబయలైంది. ఇదే సెక్టార్‌లో జనవరి 13న బోబియాన్ గ్రామంలో 150 మీటర్ల సొరంగాన్ని గుర్తించారు. పాకిస్థాన్ సరిహద్దులో యాంటీ టన్నెల్ ఆపరేషన్‌లో భాగంగా బిఎస్‌ఎఫ్ వీటిని గుర్తించింది. ఉగ్రవాదుల్ని భారత్‌లోకి పంపేందుకు పాకిస్థాన్ ఆర్మీ ఆధ్వర్యంలో ఈ సొరంగాల నిర్మాణం జరుగుతోందనేది బహిరంగ రహస్యమే. ఆరు మాసాల వ్యవధిలో నాలుగు సొరంగాలను సాంబా, కథువా జిల్లాల్లోని అంతర్జాతీయ సరిహద్దులో గుర్తించారు.
- Advertisement -