Friday, November 15, 2024

నవ్ దీప్ కు నోటీసులు

- Advertisement -
- Advertisement -

మరో ఇద్దరికి ముందస్తు బెయిల్
సెప్టెంబర్ 26న పోలీసులకు సరెండర్ కావాలని ఆదేశం
విచారణకు రావాలంటూ నవదీప్‌కు నార్కొటిక్ అధికారులు 41 ఎ కింద నోటీసులు
పలువురు సినీ, రాజకీయ ప్రముఖులకు త్వరలో నోటీసులు..?
ఉలికిపడుతున్న టాలీవుడ్

మన తెలంగాణ/హైదరాబాద్ : డ్రగ్స్ కథాచిత్రంలో అనేకానేక కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. మరోమారు టాలీవుడ్‌ను షేక్ చేసేలా మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో మరో ఇద్దరికి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కలహర్ రెడ్డితో పాటు స్నార్ట్ పబ్ యజమానికి ముందస్తు బెయిల్ ఇస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా వీరిద్దరిని సెప్టెంబర్ 26న పోలీసులకు సరెండర్ కావాలని ఆదేశించింది. మరోవైపు ఈ కేసులో కొందరు సినీ, రాజకీయ నేతలకు కూడా నోటీసులు ఇవ్వాలని నార్కోటిక్ బ్యూరో భావిస్తోంది. ప్రధానంగా హీరో నవదీప్, అతని స్నేహితుడు రాంచంద్‌లతో కాంటాక్ట్ అయినవారికి నోటీసులు ఇవ్వాలని యోచిస్తున్నారు. అంతకుముందు మాదాపూర్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న నవదీప్‌కు నార్కొటిక్ బ్యూరో అధికారులు 41ఎ కింద నోటీసులు జారీ చేశారు. నవదీప్ ఇంటి వద్ద ఈ నోటీసులు అందజేశారు.

ఈ నెల 23వ తేదీన హెచ్-న్యూ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. నవదీప్, అతని స్నేహితుడు రాంచంద్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా నార్కొటిక్ బ్యూరో ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే నవదీప్ మాత్రం ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడు. ఇదే కేసులో మరికొంత మంది ఉన్నట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. పబ్ యజమాని సూర్య, కలహార్ రెడ్డి, శ్వేత, సినీ ఫైనాన్షియర్ రవి, కార్తీక్, శ్వేతలను డ్రగ్స్ వాడకందారులుగా చేర్చారు. వీళ్లంతా కూడా హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుల్లోనూ నార్కోటిక్ పోలీసులు కౌంటర్ దాఖలు చేయనున్నారు.

మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ విక్రయించే రాంచందర్‌తో నవదీప్‌కు ఉన్న పరిచయాలపై నార్కోటిక్ పోలీసులు ఆధారాలు సేకరించారు. వాట్సాప్ చాటింగ్ తోపాటు కాల్ డేటాను సేకరించారు. దీని ఆధారంగా నవదీప్‌ను పోలీసులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. కాగా, సెప్టెంబర్ 16వ తేదీన హైదరాబాద్‌లోని నవదీప్ ఇంట్లో నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. ఇటీవల మరో ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వారిలో ముగ్గురు నైజీరియన్లు ఉన్నారు. నైజీరియన్లు ఆమోబీ, మైఖేల్, థామస్, సినీ దర్శకుడు సుశాంత్ రెడ్డి, ఇండస్ట్రీతో సంబంధం ఉన్న రాంచందర్, దేవరకొండ సురేశ్ రావు, ఖమ్మం సాఫ్ట్‌వేర్ ఉద్యోగి సందీప్, శ్రీకర్ కృష్ణప్రణీత్‌లను నార్కోటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో అరెస్ట్ చేసింది. సురేశ్ రావు వద్ద 4 గ్రాముల డ్రగ్స్ దొరి కింది. మరో ఎనిమిది మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిర్మాత ఉప్పలపాటి రవి, స్నార్ట్ పబ్ ఓనర్ సూర్య, బిస్త్రా, టెర్రా కేఫ్ ఓనర్ అర్జున్, విశాఖపట్నం వాసి కలహర్ రెడ్డి, మరో ఐదుగురు డ్రగ్స్ ట్రాన్స్‌పోర్ట్ చేస్తున్న మరో ముగ్గురు నైజీరియన్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సినీ నటుడు నదవీప్‌కు డ్రగ్స్ చేరేవని పోలీసులు వెల్లడించారు.

నవదీప్‌కు 41ఏ నోటీసు ఇవ్వాలన్న హైకోర్టు
ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్, తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డైరెక్టర్ సీవీ ఆనంద్ మీడియాతో మాటా ్లడుతూ.. ఈ కేసులో వాంటెడ్ గా ఉన్న నటుడు నవదీప్ పరారీలో ఉన్నాడని తెలిపారు. ఈ క్రమంలోనే నవదీప్ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఇప్పటికే కస్టడీలో ఉన్న స్నేహితుడు రాంచంద్ నుంచి నవదీప్ డ్రగ్స్ తీసుకున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని హైదరాబాద్ పోలీసుల తెలిపారు. మరోవైపు నవదీప్ ఈ కేసులో ఎలాంటి ప్రమే యం లేదని ఖండించారు. అయితే ఇరువైపుల న్యాయవాదనలు విన్న న్యాయస్థానం.. నవదీప్‌కు సిఆర్‌పిసి సెక్షన్ 41ఎ నోటీసు ఇచ్చి విచారణ చేపట్టాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నవదీప్ పోలీసుల ముందు హాజరై వారి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆదేశిం చారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News