Sunday, December 22, 2024

జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్

- Advertisement -
- Advertisement -

అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్‌పై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కుంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. జానీ మాస్టర్ సతీమణి సుమలత ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ముందు హాజరయ్యారు. ఇటీవల జానీ మాస్టర్‌పై ఆరోపణలు చేసిన మహిళపై ఫిల్మ్ ఛాంబర్‌లో సుమలత ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు నేపథ్యంలో సుమలత నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వివరణ కోరింది. దీంతో వివరణ ఇచ్చేందుకు బుధవారం ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ ముందు సుమలత హాజరయ్యారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్‌పై మహిళా కొరియోగ్రాఫర్ చేస్తున్న ఆరోపణలను సుమలత ఖండించారు. మహిళా కొరియోగ్రాఫర్‌కు సంబంధించిన అన్ని ఆధారాలను ఫిల్మ్ ఛాంబర్ కమిటీకి జానీ మాస్టర్ భార్య అందించారు. తన భర్త జానీపై లేని పోనీ ఆరోపణలు చేసిన మహిళా కొరియోగ్రాఫర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. సుమలత దగ్గర నుంచి ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కమిటీ సభ్యులు వివరాలు సేకరిస్తున్నారు.

కాగా కొరియోగ్రాఫర్‌గా పని చేయడం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో పేధింపులకు గురి చేసిందని ఇటీవల ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు సుమలత తెలిపింది. “ఐదు సంవత్సరాలుగా నరకం అంటే ఏంటో నాకు చూపించింది. నేను ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు తీసుకెళ్లింది. నాకు అమ్మ వద్దు నాన్న వద్దు నువ్వు పెళ్లి చేసుకో అంటూ జానీ మాస్టర్‌పై తీవ్ర ఒత్తిడికి గురిచేసింది. నా భర్త జానీ మాస్టర్‌ను ఇంటికి రాకుండా అడ్డుకునేది. కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే ఇంటికి పంపేది. బాధితురాలు ఇంటికి వెళ్లి జానీ మాస్టర్‌ను నువ్వు ఇష్టపడితే ఆయన జీవితం నుంచి నేను వెళ్ళిపోతాను అని చెప్పాను. బాధితురాలు మాత్రం మాస్టర్ నాకు అన్నయ్య లాంటివాడు మీరు నాకు వదిన అంటూ నమ్మించింది. నా భర్తతో కాకుండా చాలామంది మగవాళ్ళతో బాధితురాలు అక్రమ సంబంధం ఉంది.

ఇవన్నీ తెలుసుకున్న జానీ మాస్టర్ అమ్మాయిని దూరం పెట్టాడు. దీంతో కక్ష కట్టి తన పైన లైంగిక దాడి చేశాడు అంటూ అక్రమ కేసు పెట్టింది. పేరున్న డబ్బున్న మగవారిని టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురిచేస్తుంది. బాధితురాలతో పాటు అమ్మాయి తల్లి కూడా ఇబ్బందులకు గురి చేసింది. ఆమె పెట్టిన అక్రమ కేసు ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నాకు నా పిల్లలకు ఏం జరిగినా తల్లి కూతుళ్ళదే బాధ్యత. నాకు నా పిల్లలకు న్యాయం చేయాలని కమిటీని కోరుకుంటున్నాను” అంటూ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్‌కు సుమలత ఫిర్యాదు చేసింది.

అవార్డు అందుకోవాలి.. బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులో జానీ మాస్ట్ పిటిషన్!
మరోవైపు తాను అవార్డు అందుకోవాలని, తనకు ఐదు రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కోర్టులో జానీ మాస్టర్ పిటిషన్ దాఖలు చేశాడు. నార్సింగ్ పోలీసులకు ఇచ్చిన నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో జానీని మళ్లీ ఉప్పరవల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. అనంతరం అతడిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. ‘నాకు ఇటీవల ఉత్తమ నృత్యదర్శకుడిగా అవార్డు వచ్చింది. దాని కోసం ఢిల్లీ వెళ్లి అవార్డు అందుకోవాల్సి ఉంది. అందుకుగాను ఐదు రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వండి’ అని జానీ కోర్టును కోరాడు. కాగా, ఈ పిటిషన్‌పై ఈ నెల 7న విచారణ చేపడతామని రంగారెడ్డి పోక్సో కోర్టు వ్లెలడించింది. ఇంకో వైపు కొరియోగ్రాఫర్ బెయిల్ పిటిషన్‌ను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు కౌంటర్ పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. నిందితుడిని బయటకు వదిలితే సాక్షులను పర్భావితం చేసే అవకాశం ఉందంటూ అతడికి బెయిల్ మంజూరు చేయొద్దని తమ పిటిషన్‌లో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News