హైదరాబాద్: మస్తాన్ సాయి, లావణ్య కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. లావణ్యతో తరచూ వాట్సాప్‌లో డిఐ శ్రీనివాస్ వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడు. లావణ్య, శ్రీనివాస్ కాల్స్ సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. లావణ్యతో డిఐ శ్రీనివాస్ మాట్లాడింది నిజమేనని విచారణలో తేలడంతో ఐజి ఆఫీసుకు అటాచ్ చేశారు. డిఐ శ్రీనివాస్‌ను సైబరాబాద్ సిపి ఐజీ ఆఫీసుకు అటాచ్ చేశారు. ఈ వీడియోలపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.
లావణ్య-రాజ్ తరుణ్ కేసులో లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పలువురు అమ్మాయిలతో ప్రైవేట్ గా ఉన్న సమయంలో వీడియోలు రికార్డ్ చేయడంతో ఆ వీడియోలతో మస్తాన్ బ్లాక్ మెయిల్‌కు పాల్పడుతున్నట్లు పోలీసుల గుర్తించారు. మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 200 వీడియోలకుపైగా ఉన్నట్లు పోలీసులు గుర్తించిన విషయం విధితమే. హార్డ్ డిస్క్ ను పోలీసులకు లావణ్య అప్పగించింది.
Courtesy by Big tv