Wednesday, January 22, 2025

మే 21న మరో వందేభారత్ రైలు ప్రారంభం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: త్వరలోనే సికింద్రాబాద్ నుంచి మరో వందేభారత్ రైలు పట్టాలెక్కనుంది. సికింద్రాబాద్ టు బెంగళూరు మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ రైలును వచ్చే నెల 21వ తేదీన ప్రారంభించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఈ రైలు రూట్ మ్యాప్‌ను దాదాపుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెగ్యులర్‌గా సికింద్రాబాద్- టు బెంగళూరుల మధ్య సుమారు ఏడు రైలు సర్వీసులను రైల్వే శాఖ నడుపుతోంది. ఇక ఈ రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం దాదాపు 11 గంటలు పడుతోంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఆ ప్రయాణాన్ని ఏడు గంటలకు తగ్గించేలా రైల్వే అధికారులు షెడ్యూల్ సిద్ధం చేసినట్టుగా తెలిసింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News