ఉత్తరప్రదేశ్‌లోని తోడేళ్ల దాడులు నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. బహ్రైచ్ జిల్లాలోని మహాసి ప్రాంతంలో మరోసారి తోడేలు దాడి చేసింది. మంగళవారం రాత్రి తోడేలు దాడి చేయడంతో 11 ఏళ్ల బాలిక గాయపడింది. తీవ్రంగా గాయపడని బాలికను చికిత్స నిమిత్తం స్థానిక మహాసి ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని స్థానికుల్లో భయాందోళన నెలకొంది. దీంతో తోడేలును పట్టుకునేందుకు అటవీ శాఖ సెర్చ్ ఆపరేషన్ చేప్టటారు.
కాగా.. బహ్రైచ్ జిల్లాలోని దాదాపు 50 గ్రామాలను ఆరు తోడేళ్ల గుంపు భయభ్రాంతులకు గురిచేస్తుంది. గత జూలై నుంచి తోడేళ్ల దాడుల్లో ఎనిమిది మందిని చనిపోవడంతోపాటు మరో 20 మందికి పైగా గాయపడ్డారు. దీంతో రంగంలోకి దిగిన అటవి శాఖ అధికారులు తోడేళ్లను పట్టుకునేందుకు ‘ఆపరేషన్ భేదియా’ చేపట్టారు. ఇప్పటికే నాలుగింటిని బంధించారు. ఇక, మంగళవారం (సెప్టెంబర్ 10) ఉదయం గుంపులోని ఐదో తోడేలును అటవీ శాఖ బృందం పట్టుకుంది. ఆరోవ తోడేలు ‘ఆల్ఫా’ కోసం అధికారులు వేట కొనసాగిస్తున్నారు.